క్రీడాభూమి

విశ్వవిజేత ఫ్రాన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్కో, జూలై 15: ఒకపక్క హాట్ ఫేవరిట్ క్రొయేషియా... మరోపక్క రెండోసారి కప్‌ను చేజిక్కించుకోవాలన్న పట్టుదలతో ఫ్రాన్స్... తుది పోరు ఉత్కంఠగా ప్రారంభమైనా క్రొయేషియా సెల్ఫ్‌గోల్ మ్యాచ్ తీరునే మార్చేసింది. ఎంత పోరాడినా ఫ్రాన్స్ ధాటిముందు క్రొయేషియా ఆటగాళ్లు డీలా పడ్డారు. దీంతో ఫ్రాన్స్ విశ్వవిజేతగా నిలిచింది. రెండు దశాబ్దాల తర్వాత మరోసారి సాకర్ కప్పును చేజిక్కించుకుంది. ఉత్కంఠ భరితంగా సాగిన తుది పోరులో 4-2 తేడాతో క్రొయేషియాను ఓడించి, రెండోసారి టైటిల్‌ను అందుకుంది. తొలిసారిగా ఫైనల్‌కు ప్రవేశించి హాట్ ఫేవరిట్‌గా మారిన క్రొయేషియా ఆశలపై నీళ్లు చల్లింది. క్రొయేషియా ఆటగాడి పుణ్యాన తొలి గోల్ ఫ్రాన్స్ ఖాతాలో పడినప్పుడు, కేవలం అదృష్టం వరించిందే తప్ప ఆ జట్టు గొప్పేమీ కాదని నిట్టూర్చిన వారికి సరైన సమాధానం ఇచ్చింది. ప్రత్యర్థి గోల్ పోస్టుపై పదేపదే దాడులకు దిగింది. క్రొయేషియాను పూర్తి ఆత్మరక్షణలోకి నెట్టేసింది. అయితే, ఫ్రాన్స్‌కు ఆశించినంత సులభంగా విజయం అందలేదనే చెప్పాలి. చావో రేవో తేల్చుకోవాలన్న పట్టుదలతో ఆడిన క్రొయేషియా వీరుల నుంచి గట్టిపోటీని ఎదుర్కొంది. కానీ, ఒత్తిడిని అధిగమించి వరుస గోల్స్‌తో క్రొయేషియాను కంగు తినిపించింది. చివరికి ట్రోఫీని అందుకుంది. 1998లో మొదటిసారి ఫిఫా వరల్డ్ కప్‌ను అందుకున్న ఫ్రాన్స్ రెండు దశాబ్దాల తర్వాత మరోసారి విజయకేతనం ఎగురవేసింది. మ్యాచ్ ఆరంభంలో ఇటు ఫ్రాన్స్, అటు క్రొయేషియా ఆత్మరక్షణ విధానానే్న అనుసరించాయి. పోరు ఉత్కంఠ దశకు చేరుకోక ముందే, 18వ నిమిషంలో క్రొయేషియా స్టార్ ఆటగాడు మారియో మాండ్జుకీ
ఓన్ గోల్ చేసి ఫ్రాన్స్‌ను 1-0 ఆధిక్యంలో నిలబెట్టాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో జట్టుకు కీలక గోల్‌ను అందించి, అందరి నుంచి ప్రశంసలు అందుకున్న అతను ఫైనల్‌లో పొరపాటు చేయడం క్రొయేషియా అభిమానులను నిరాశపరచింది. మారియో ఓన్ గోల్ కారణంగా ప్రత్యర్థికంటే వెనుకబడిన క్రొయేషియాకు 28వ నిమిషంలో ఇవాన్ పెన్సిక్ ద్వారా ఈక్వెలైజర్ లభించింది. గోల్స్ సమం కావడంతో కంగుతిన్న ఫ్రాన్స్ చెలరేగిపోయింది. మరో పది నిమిషాల్లోనే ఆంటానియో గ్రీజ్మన్ గోల్ చేయడంతో ప్రథమార్థం ముగిసే సమయానికి 2-1 ఆధిక్యాన్ని సంపాదించింది.
ద్వితీయార్ధంలో క్రొయేషియా దాడులు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ, ఫ్రాన్స్ కూడా అదే స్థాయిలో ఎదురుదాడి చేసింది. క్రొయేషియా క్రమంగా మ్యాచ్‌పై పట్టును కోల్పోతుండగా, ఫ్రాన్స్ రెట్టించిన ఉత్సాహంతో పోరును కొనసాగించింది. 59వ నిమిషంలో పాల్ పోగ్బా చేసిన గోల్ ఫ్రాన్స్‌ను మరోసారి ఆధిక్యంలో నిలిపింది. మరో ఆరు నిమిషాల్లోనే కీలియన్ మాపే ఫ్రాన్స్‌కు నాలుగో గోల్‌ను సాధించిపెట్టాడు. ఈ గోల్ తర్వాత ఫ్రాన్స్ జోరును తగ్గించగా, అదే అవకాశంగా తీసుకున్న క్రొయేషియా ఆటగాడు మారియో గోల్ చేశాడు. ఓన్ గోల్ ద్వారా తాను చేసిన పొరపాటును అతను సరిదిద్దుకున్నాడు. కానీ, అప్పటికే మ్యాచ్ క్రొయేషియా చేయిదాటి పోయింది. రెండు గోల్స్ ఆధిక్యంలో ఉన్న కారణంగా ఫ్రాన్స్ ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆటను కొనసాగించింది. విజయభేరి మోగించింది.