క్రీడాభూమి

అయ్యో.. సింధూ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్యాంకాక్, జూలై 15: భారత స్టార్ షట్లర్ సింధు మళ్లీ ఓడింది. ఈ ఏడాది ఒక్క టోర్నమెంట్‌లోనూ శుభారంభం లేకుండా వైఫల్యాలను కొనసాగిస్తోంది. మొన్న మలేసియా.. నిన్న ఇండోనేషియా.. ఇప్పుడు థాయ్‌లాండ్. పోరాడి ఫైనల్‌కు చేరుకుని టైటిల్ సొంతం చేసుకోవాలనుకున్న సింధు ఆశలకు జపాన్ షట్లర్ నజొమి ఒకుహరా బ్రేక్ వేసింది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఒలింపిక్ కాంస్య పతక విజేత సింధుకు థాయ్‌లాండ్ ఓపెన్ టోర్నీ ఫైనల్లో నిరాశే మిగిలింది. అదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సింధు 15-21, 18-21 స్కోరుతో ప్రత్యర్థి నజొమి ఒకుహరా చేతిలో ఓటమిపాలై రన్నర్ ట్రోఫీకే పరిమితమైంది. ఈ మ్యాచ్ తొలి సెట్‌లో ఒకుహరా దూకుడుగా ఆడుతూ సింధుకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పాయింట్లు సాధించటం గమనార్హం. 50 నిమిషాలు సాగిన గేమ్‌లో తొలి సెట్‌లో ఒకుహరా 21-15 స్కోరుతో ఆధిక్యంలో నిలిచింది. కాగా రెండో సెట్‌లో సింధు విజృంభించినా, అటాకింగ్ గేమ్‌తో ఒకుహరా ఎక్కువసేపు అవకాశం ఇవ్వలేదు. రెండో సెట్‌లోనూ 21-18తో ఆధిక్యంలో నిలిచిన ఒకుహరా, 2-0తో విజయం సాధించింది. ఇప్పటి వరకు ఒకుహరా ఆరుసార్లు ద్వితీయ సీడ్ సింధుపై గెలుపొందడం గమనార్హం. సింధు ఈ టోర్నీలో అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించి ఫైనల్‌కు చేరుకున్నా, ఫలితం మాత్రం దక్కలేదు. సింధుపై భారత అభిమానులు పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి.