క్రీడాభూమి

ఈ టైటిల్ బాబ్‌దే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 15: బ్యాకప్ పార్టనర్‌గా తనకు తనే సాటి అని నిరూపించుకున్నాడు మైక్ బ్రేయన్. వింబుల్డన్ పురుషుల డబుల్స్‌లో 17వసారి గ్రాండ్‌స్లామ్‌ను సొంతం చేసుకుని సత్తా చాటుకున్నాడు. అయితే, ఈసారి బ్రేయన్ భాగస్వామిగా అతని సోదరుడు బాబ్ లేకపోవడం ఓ సెనే్సషన్ అయితే, రెండే రెండు టోర్నీల్లో కలిసి ఆడిన జాక్‌సోక్‌తో జతకట్టడం మరో సెనే్సషన్. సెంటర్ కోర్టులో శనివారం రాత్రి మూడున్నర గంటలపాటు సాగిన డబుల్స్ ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఆటగాడు రావెన్ క్లాసెన్, న్యూజిలాండ్ ఆటగాడు మిఖాయిల్ వీనస్ ద్వయాన్ని 6-3, 6-7 (7), 6-3, 5-7, 7-5 స్కోరుతో మట్టికరిపించి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. నిజానికి బ్రేయన్ తన సోదరుడు బాబ్‌తో కలిసి ఎన్నో విజయాలు సాధించిన రికార్డు ఉంది. భుజానికి గాయం కారణంగా బాబ్ టోర్నీకి దూరమవటంతో, జాక్‌సోక్‌తో కలిసి బ్రేయన్ ఆడాల్సివచ్చింది. ‘ఈ టైటిల్‌ను బాబ్‌కు అంకితమివ్వాలనుకుంటున్నా. కచ్చితంగా ఈ మ్యాచ్‌ను అతను టీవీలో చూస్తుంటాడు’ అంటూ మ్యాచ్ అనంతరం బ్రేయన్ వ్యాఖ్యానించాడు. ‘ఈ టూర్‌లో బాబ్ లేకపోవడం బాధాకరం. టెన్నిస్‌లో అతను లెజెండ్. నేను అతని స్థానాన్ని భర్తీ చేశానని అనుకోవట్లేదు. కాకపోతే బ్రేయన్‌కు గేమ్‌లో సహకరించానంతే’ అంటూ జాక్ సోక్ వ్యాఖ్యానించాడు.
నొవోత్నకే టైటిల్ అంకితం: బార్బోరా
చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి క్రెజ్‌సికోవా తన భాగస్వామి కటెరినా సినియకోవాతో కలిసి రెండోసారి గ్రాండ్‌శ్లామ్ టైటిల్ సొంతం చేసుకుంది. శనివారం రాత్రి జరిగిన ఫైనల్స్‌లో క్వెటా పెశె్చకె, నికోల్ మెలిఖర్ ద్వయంపై పోరాడి 6-4, 4-6, 6-0 స్కోరుతో విజయం సాధించారు. బార్బోరా మెంటార్, ట్రెయినర్ అయిన నవోత్నకు టైటిల్ అంకితమిస్తూ ‘ఆమె నన్ను చూసి గర్విస్తుంటుంది’ అని వ్యాఖ్యానించింది. ఒవారియన్ క్యాన్సర్ కారణంగా నొవోత్న గత ఏడాది నవంబర్‌లో కన్నుమూయడం తెలిసిందే.