క్రీడాభూమి

జాతీయ జట్టుకు లీజియన్ ఆనర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, జూలై 16: ఫిఫా ప్రపంచకప్ సాధించుకొస్తున్న జాతీయ జట్టు ఆటగాళ్లకు ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం ‘లీజియన్ ఆఫ్ ఆనర్’ను ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రోన్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘అనిర్వచనీయ సేవలందించిన వారికిచ్చే దేశ అత్యున్నత పురస్కారం లీజియన్ ఆఫ్ ఆనర్‌ను ఆటగాళ్లకు ప్రదానం చేయనున్నాం’ అని పేర్కొంది. అయితే పురస్కారం ఎప్పుడిచ్చేదీ ప్రకటించలేదు. మాస్కోనుంచి పారిస్‌కు బయలుదేరిన ఫ్రాన్స్ జట్టుకు ఘన స్వాగతం పలికేందుకు లక్షలాది అభిమానులు చాంప్స్ ఎలిసీస్ వద్ద ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.