క్రీడాభూమి

భారత్.. బంగారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 16: సెర్బియాలో జరుగుతోన్న 36వ గోల్డెన్ గ్లోవ్ ఆఫ్ వొజోదినా యూత్ బాక్సింగ్ టోర్నీలో భారత్ బాక్సర్లు ఏడు స్వర్ణాలు సాధించారు. 13 స్వర్ణాల లక్ష్యంతో ఫైనల్ బరిలోకి దిగిన భారత బాక్సర్లకు, ప్రత్యర్థి బాక్సర్లు గట్టి పోటీనివ్వడంతో ఏడు స్వర్ణాలకే పరిమితం కావాల్సి వచ్చింది. టోర్నమెంట్‌లో ఏడు స్వర్ణ పతకాలు, ఆరు రజిత పతకాలు, నాలుగు కాంస్య పతకాలు కలుపుకోని మొత్తం 17 పతకాలు సాధించిన భారత్, 17 దేశాలు పాల్గొన్న టోర్నీలో అగ్రస్థానంలో నిలిచింది. ప్రతిష్టాత్మక టోర్నీలో రష్యా మూడు స్వర్ణాలు, రెండు రజితం, ఆరు కాంస్య పతకాలు.. మొత్తం 11 పతకాలతో రెండో స్థానంలో నిలిచింది. కిజికిస్తాన్ బాక్సర్లు ఐదు స్వర్ణాలు సహా ఏడు పతకాలతో తృతీయస్థానంతో సంతృప్తిపడాల్సి వచ్చింది. భారత జట్టులో అమన్ (91+), ఆకాష్ కుమార్ (56కేజీలు), ఎస్ భరుణ్‌సింగ్ (49కేజీలు), విజయ్‌దీప్ (69కేజీలు), నీతు (48కేజీలు), దివ్యపవార్ (54కేజీలు), లలిత (69కేజీలు) స్వర్ణ పతకాలు సాధించారు. జ్యోతి గులియా (51కేజీలు), మనీష (64కేజీలు), నేహాయాదవ్ (81+), అంకిత్ (60కేజీలు), ఆకాష్ (64కేజీలు), నితిన్ కుమార్ (75కేజీలు) రజిత పతకాలు సాధించారు. సాక్షి (51కేజీలు), సాక్షిగైధాని (81కేజీలు), భావేష్ కిట్టామని (52కేజీలు), అనామిక (51కేజీలు)లు కాంస్య పతకాలు సాధించి భారత ప్రతిష్టకు వనె్నతెచ్చారు.