క్రీడాభూమి

జోరుమీదున్న జొకోవిచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 16: లండన్‌లో జరిగిన ప్రతిష్టాత్మక వింబుల్డన్ పురుషుల సింగిల్స్ గ్రాండ్ శ్లామ్ టైటిల్ దక్కించుకున్న 31ఏళ్ల సెర్బియా టెన్నిస్ స్టార్ ఆటగాడు నవోక్ జొకోవిచ్ ఇపుడు యూఎస్ ఓపెన్‌పై కనే్నశాడు. వింబుల్డన్ టోర్నీల్లో 2011లో తొలిసారి చాంపియన్‌గా అవతరించిన జొకోవిచ్, ఆ తర్వాత 2014, 2015ల్లో సైతం టైటిల్ సాధించాడు. తాజాగా ఆదివారం జరిగిన వింబుల్డన్ ఫైనల్‌లో దక్షిణాఫ్రికా క్రీడాకారుడు కెవిన్ ఆండర్సన్‌పై ఏకపక్ష పోరుతో ఘన విజయాన్ని నమోదు చేశాడు. జొకోవిచ్ ఖాతాలో నాలుగు వింబుల్డన్ చాంపియన్‌షిప్ టైటిళ్లున్నాయి. ఈ ఏడాది వింబుల్డన్ చాంపియన్‌గా అవతరించిన ఉత్సాహంతో, యూఎస్ ఓపెన్‌లో హ్యాట్రిక్ సాధించే ప్రయత్నాలకు పదును పెడుతున్నాడు. తాజా విజయంతో రెట్టించిన ఉత్సాహంతో ఉన్నానని, భవిష్యత్ టోర్నీల్లో విశ్వసనీయ ఆట ప్రదర్శిస్తానని నమ్మకంగా చెబుతున్నాడు. రెండేళ్ల విరామం తర్వాత మరోసారి గ్రాండ్‌శ్లామ్‌లో ఘన విజయం సాధించడాన్ని మరికొంతకాలంపాటు ఆస్వాదిస్తానన్నాడు.
టాప్-10లో జొకోవిచ్
తాజా ఏటీపీ టెన్నిస్ ర్యాంకింగుల్లో నవోక్ జొకోవిచ్ 10వ స్థానానికి చేరాడు. ఆదివారం జరిగిన వింబుల్డన్ ఫైనల్‌లో 6-2, 6-2, 7-6 (7-3)తో దక్షిణాఫ్రికా ఆటగాడు కెవిన్ ఆండర్సన్‌పై ఘనవిజయం సాధించి, గ్రాండ్‌శ్లామ్ టైటిల్ దక్కించుకున్న సెర్బియా స్టార్, ఏటీపీ ర్యాంకింగ్స్‌లో ఏకంగా 11స్థానాలు ఎగబాకి 10కి చేరుకున్నాడు. వింబుల్డన్ ట్రోఫీ ఫైనల్‌లో జొకోవిచ్‌తో తలపడిన కెవిన్ ఆండర్సన్ ఐదో ర్యాంక్‌లో ఉన్నాడు. కాగా, ఏటీపీ తాజా ర్యాంకింగ్స్‌లో రాఫెల్ నాదల్ 9310 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుంటే, రోజర్ ఫెదరర్, అలెగ్జాండర్ జ్వెరెవ్, జువాన్ మార్టిన్ డెల్ పొట్రో, కెవిన్ ఆండర్సన్, గ్రిగర్ డిమిట్రోవ్, మారిన్ సిలిస్, జాన్ ఇస్నర్, డొమినిక్ థీమ్, నవోక్ జొకోవిచ్ వరుసగా రెండు నుంచి పది స్థానాల్లో నిలబడ్డారు.