క్రీడాభూమి

వర్షించే ఆనందం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, జూలై 16: ఏమైతేనేం. 20ఏళ్ల కలను సాకారం చేసిన జాతీయ జట్టు మహదానంతో మాస్కోను వీడింది. ఒక్కో ఆటగాడు ఒక్కో ఈఫిల్ టవర్‌లా స్వదేశానికి బయలుదేరారు. దిగ్గజాలను దిక్కులదిరేలా రిసీవ్ చేసుకోడానికి లక్షలాది ఫ్రాన్స్‌వాసులు సిద్ధమయ్యారు. స్వదేశాన్ని ముస్తాబు చేశారు. ఈఫిల్ టవర్ వెలిగిపోతోంది. ఆర్క్ డె ట్రోంఫె ధగధగలాడుతోంది. ఎక్కడ చూసినా జాతీయ జెండాలోని నీలం, తెలుపు, ఎరుపు రంగుల శోభే కనిపిస్తోంది. ప్రపంచకప్‌తో జగజ్జట్టు కాలుమోపే చాంప్స్ ఎలిసీవద్ద అభిమానుల ఎదురు చూస్తున్నారు. సోమవారం స్వదేశంలో కాలుమోపే చాంపియన్లను ఓపెన్ టాప్ ఎలక్ట్రిక్ బస్సులో తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు జరిగిపోయాయి. జట్టు సాధించిన ఘనతను పదే పదే స్మరించేందుకు కామెంటేటర్లూ రెడీ అయ్యారు. గొప్పగా గౌరవించుకుంటున్నాం అని చెప్పడానికి ఐదు మెట్రో స్టేషన్ల పేర్లూ తాత్కాలికంగా మార్చేశారు. ఘనత సాధించిన గజాటగాళ్లు ఎంబప్పె, పాల్ పోగ్బ తదితరుల దరహాసంలో ప్రపంచకప్ ఎలా ప్రతిబింబిస్తుందో చూడ్డానికి నలు చెరుగుల నుంచీ అభిమానులూ గేదరవుతున్నారు. ఒక అనిర్వచనీయ ఆనందం ఇప్పుడు ఫ్రాన్స్‌ను వర్షించే మేఘంలా కమ్ముకుని ఉంది. ఆటగాళ్లు దిగీదిగగానే కమ్ముకున్న ఆనంద మేఘాలు వర్షించడం ఖాయం. ప్రపంచకప్ విజయాన్ని మించిన గొప్ప గౌరవం అదే కావొచ్చు. అయతే ఫ్రాన్స్ గెలుపుతో శృతిమించిన సెలబ్రేషన్ పారిస్‌లో ‘రచ్చ రంబోలా’ సృష్టించింది. కొందరు యువకుల ‘అతి’.. సామాన్యులను భయబ్రాంతులకు గురిచేసింది. క్రొయేషియాపై ఫ్రాన్స్ నాలుగో గోల్ సాధించగానే, డజన్లకొద్దీ యువకులు స్కి మాస్క్‌లతో రోడ్డెక్కారు. కొందరు యువకులు లిక్కర్ షాపుల కిటికీలు విరగ్గొటి చేతికందిన బాటిళ్లను లూటీ చేశారు. అక్కడి ‘వెర్రి ఆనందాన్ని’ మరికొందరు సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు. అల్లర్లను నియంత్రించడానికి టియర్ గ్యాస్ ప్రయోగించిన సెక్యూరిటీ ఫోర్స్‌పైనా ఇంకొందరు యువకులు దాడులకు దిగారు. ఆదివారం అర్థరాత్రి ఫ్రాన్స్‌లో చాలాచోట్ల ఇవే దృశ్యాలు.
మెట్రో స్టేషన్లకు కోచ్, కెప్టెన్ పేర్లు
పేర్లు మారిన మెట్రో స్టేషన్లను చూసి పారిస్ వాసులు ఖంగుతిన్నారు. ఆలస్యంగానైనా విషయం తెలుసుకుని ఆనందించారు. ప్రపంచకప్ పోరులో విజయఢంకా మోగించి ఫ్రాన్స్‌కు బయలుదేరిన ఆటగాళ్ల గౌరవార్థం పారిస్‌లోని ఐదు మెట్రో స్టేషన్ల పేర్లను తాత్కాలికంగా మార్చారు. కోచ్, టీం, కెప్టెన్ పేర్లు కలిసొచ్చేలా మెట్రో స్టేషన్ల వద్ద కొత్త పేర్లతో
డిస్‌ప్లే పెట్టడంతో పారిస్ ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విక్టర్ హుగో స్టేషన్‌కు విక్టర్ లుగో ల్లోరిస్ అన్న కొత్త పేరొచ్చింది. జట్టు సారథి, ఫ్రాన్స్ గోల్‌కీపర్ పేరు కలిసొచ్చేలా ఆ స్టేషన్‌కు పేరు పెట్టారు. జట్టు మొత్తానికి గౌరవం దక్కేలా బెర్సీ మెట్రో స్టాప్‌ను బెర్సీ లెస్ బ్లూస్‌గా మార్చారు. ఎవరాన్ స్టేషన్‌కు నౌస్ ఎవరాన్ గగ్నే (మనం గెలిచాం) అన్న అర్థంతో పేరు పెట్టారు. చార్లెస్ డె గౌల్లె- ఎటోయ్‌లె స్టేషన్ పేరును ‘ఆన్ ఏ టు ఎటోయ్‌లెస్’ (మనకు రెండు స్టార్లున్నాయి) అన్న అర్థం వచ్చేలా మార్చారు.
ప్రపంచకప్‌ను ఫ్రాన్స్ జట్టు ముద్దాడేలా తీర్చిదిద్ది, వ్యూహాత్మక ప్రణాళికలతో ముందుకు నడిపించిన కోచ్ డిడర్ (1998 ఫ్రాన్స్ జట్టులో డిడర్ మిడ్‌ఫీల్డర్) గౌరవార్థం నోట్రె-డమె డెస్ చాంప్స్ స్టేషన్ పేరును నోట్రె డిడర్ డెస్‌చాంప్స్‌గాను, చాంప్స్ -ఎలిసీస్ క్లెమెన్షు స్టేషన్ పేరును డెస్‌చాంప్స్ ఎలీసీస్- క్లెమెన్షుగాను మార్చారు.
ప్రపంచకప్ కల నెరవేర్చిన జాతీయ జట్టు గౌరవార్థం తాత్కాలికంగా మెట్రో స్టేషన్ల పేర్లు మార్చినట్టు పారిస్ ట్రాన్స్‌పోర్ట్ ఆపరేటర్ ఆర్‌ఏటిపి పేర్కొంది. అంతేకాదు, ఫ్యాన్స్ తమ ఆనందాన్ని పదిమందితో పంచుకోడానికి వీలుగా కొన్ని ట్రాన్స్‌పోర్టు సర్వీసులను ఫ్రీ చేసేసింది.