క్రీడాభూమి

సమఉజ్జీల సిరీస్ యుద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్: నెంబరింగ్ కాదు, సిరీస్ ముఖ్యం అంటున్నాడు ఇంగ్లాండ్ కెప్టెన్ మోర్గాన్. మిడిలార్డర్‌ను పటిష్టం చేస్తే సిరీస్ మనదే అన్న వ్యూహంతో ఉన్నాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. ట్రై సిరీస్‌లో చెరో మ్యాచ్ సొంతం చేసుకోవడంతో, చివరి మ్యాచ్‌పై ఉత్కంఠ నెలకొంది. మంగళవారం మ్యాచ్‌పై కోహ్లీ సేన ప్రత్యేక దృష్టిపెట్టింది. నాటింగ్‌హామ్‌లో జరిగిన తొలి వనే్డలో ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొంది ప్రత్యర్థిని సవాల్ చేసింది టీమిండియా. గురువారం లార్డ్స్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో 86 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించి ప్రతీకారం తీర్చుకుంది ఇంగ్లాండ్. దీంతో రెండు జట్ల స్కోరు 1-1తో సమమైంది. ఇప్పుడు మూడో వనే్డ ఇరు జట్లకూ అత్యంత కీలకం. సిరీస్‌పైనే దృష్టిపెట్టిన రెండు జట్లూ పదునైన వ్యూహాలతో బరిలోకి దిగుతున్నాయి. రెండో వనే్డలో మిడిలార్డర్‌పై విమర్శలు రేకెత్తడంతో, మూడో వనే్డలో ఆ పరిస్థితి ఎదురుకాకుండా టీమిండియా సన్నద్ధమైంది. డబ్లిన్, కార్డ్ఫిలలో జరిగిన టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో మిడిలార్డర్‌లో చోటుదక్కని మహేంద్ర సింగ్ ధోనీ, ఇంగ్లాండ్‌తో ఆడుతున్న మ్యాచ్‌ల్లో మూడోసారి మిడిలార్డర్‌గా బరిలోకి దిగినా ఆశించిన స్కోరు సాధించలేకపోయాడు. గత మ్యాచ్‌ల్లో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ టాప్ ఆర్డర్‌గా బరిలోకి దిగిన సందర్భంలో జట్టు సాధించిన మొత్తం పరుగుల్లో 60శాతం వరకు ఉన్నాయి. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఇప్పటికే ఇంగ్లాండ్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, భారత్ రెండో స్థానంలో ఉంది. ఇప్పుడీ ట్రై సిరీస్‌ను సొంతం చేసుకుంటే భారత్ అగ్రస్థానానికి చేరడం ఖాయం. సిరీస్‌ను చేజిక్కించుకోవడం ద్వారా ఆగస్టు 1నుంచి ఆతిధ్య జట్టుతో జరిగే టెస్టు సిరీస్‌లలో మరింత ఉత్సాహంగా పాల్గొనేందుకు వీలుంటుందని టీమిండియా భావిస్తోంది. ఇప్పటికే ఇంగ్లాండ్ టూర్‌లో ఆడిన టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో 2-1తో సిరీస్‌ను చేజిక్కించుకున్న భారత్, చివరి వనే్డలో అద్భుత ఆటతీరుతో రాణించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. 2011 నుంచీ ఇప్పటివరకు ఇంగ్లాండ్‌తో ఆడిన 17 మ్యాచ్‌ల్లో భారత్ 10సార్లు విజయం సాధించింది. ఇక ఆతిధ్య ఇంగ్లాండ్ విషయానికొస్తే భారత్‌తో ఆడిన టీ-20 సిరీస్‌ను 2-1తో చేజార్చుకున్నా, మూడు వనే్డ సిరీస్‌లో ఇప్పటికే ఇరు జట్లు చెరో మ్యాచ్‌లో గెలుపుతో సమానంగా ఉన్నాయి. మంగళవారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో తమ సత్తా ఏమిటో చూపాలని ఇయాన్ మోర్గాన్ సేన యోచిస్తోంది.