క్రీడాభూమి

సాకర్‌కు కాహిల్ గుడ్‌బై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, జూలై 17: ఆస్ట్రేలియా ఆల్‌టైమ్ గోల్ స్కోరర్ టిమ్ కాహిల్ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు గుడ్‌బై చెప్పేశాడు. 38ఏళ్ల కాహిల్ 107 అంతర్జాతీయ స్థాయి మ్యాచ్‌ల్లో పాల్గొని 50 గోల్స్ సాధించాడు. రష్యాలో జరిగిన వరల్డ్ కప్ సాకర్ చాంపియన్‌షిప్‌లో జరిగిన గ్రూప్ ఫైనల్ మ్యాచ్‌లో చివరిసారి ఆడిన టిమ్ కాహిల్ ఇప్పుడు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆస్ట్రేలియా జేర్సీ ధరించినంతకాలం తనకు అన్ని విధాలా సహకరించిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపాడు. అంతర్జాతీయ సాకర్‌కు గుడ్‌బై చెప్పిన కాహిల్, క్లబ్ ఫుట్‌బాల్ టోర్నీల్లోనో పాల్గొంటానో లేదోనన్న అనుమానం వ్యక్తం చేశాడు.