క్రీడాభూమి

వారెవ్వా.. ఎంబప్పె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, జూలై 17: ఫిఫా ప్రపంచకప్ హీరో ఎవరన్న ప్రశ్నకు ప్రపంచం మొత్తం చెప్పే ఆన్సర్ -ఫ్రాన్స్ అని. కానీ, ఫ్రాన్స్ మాత్రం ‘హీరో ఎంబప్పె’ అన్న సమాధానమిస్తోంది. ఫ్రాన్స్‌ను జగజ్జేత చేసిన కీలక ఆటగాళ్లలో పందొమ్మిదేళ్ల ఎంబప్పె పాత్ర తక్కువేం కాదు. అది జట్టు ఆటగాళ్లకు బాగా తెలుసు. సాకర్ సమరంలో రికార్డులు ఆవిష్కరించిన ఈ చిచ్చరపిడుగు -పందొమ్మిదేళ్ల వయసులో ప్రపంచకప్ ఫైనల్లో తొలి గోల్ సాధించిన ఆటగాడిగానూ రికార్డులకెక్కాడు. ప్రపంచకప్‌తో ఫ్రాన్స్ గడ్డమీద అడుగుపెట్టిన ఎంబప్పె, అక్కడ ప్రకటించిన చారిటీ నిర్ణయంతో ఫ్రాన్స్ మొత్తం షాక్ తింది. ‘నువ్వేరా హీరో’ అంటూ కొనియాడుతోంది. ప్రపంచకప్ టోర్నీ ద్వారా తనకు అందే మొత్తం సొమ్మును చారిటీకి ఇచ్చేస్తున్నట్టు ప్రకటించి సెనే్సషన్ సృష్టించాడు ఎంబప్పె. సాకర్ పోరులో ఎంబప్పె ఎనిమిది మ్యాచ్‌లు ఆడాడు. ఒక్కో మ్యాచ్‌కు 22.5వేల డాలర్లు అందుతాయి. ఇక ఫైనల్ విన్నర్‌గా అందే మొత్తం 3.5 లక్షల డాలర్లు ఉండొచ్చు. అంటే, టోర్నీతో తనకొచ్చే సుమారు 5 లక్షల డాలర్లు (్భరత కరెన్సీలో సుమారు 3.5 కోట్లు) చారిటీకి ప్రకటించేశాడు. ‘అనారోగ్య బాల్యాన్ని ఆదరించండి. క్రీడాభివృద్ధికి వినియోగించండి’ అంటూ చారిటీ సంస్థను కోరాడట. అందుకే, గేమ్‌లోనే కాదు, చారిటీలోనూ ఇప్పుడు ఎంబప్పె హీరో.