క్రీడాభూమి

మోతెక్కించిన మోర్గాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లీడ్స్: మొత్తానికి వనే్డ ట్రై సిరీస్‌ను ఆతిథ్య ఇంగ్లాండ్ 2-1తో తన్నుకుపోయింది. రెండో వనే్డను భారీ ఆధిక్యంతో సొంతం చేసుకుని భారత్‌పై వత్తిడిపెంచిన ఇంగ్లాండ్, మూడో వనే్డను సునాయాసంగా కైవసం చేసుకుని సిరీస్‌ను దక్కించుకుంది. సిరీస్ భవితవ్యాన్ని తేల్చే నిర్ణయాత్మక (లీడ్స్‌లోని హెడింగ్‌లీ మైదానం జరిగిన) మ్యాచ్‌లో భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. అందుకు ప్రతిగా ఆతిధ్య ఇంగ్లాండ్ 44.3 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. బలహీనంగావున్న టీమిండియా మిడిల్డార్ వెన్ను విరిచిన ఆదిల్ రషీద్, ఇంగ్లాండ్ విజయానికి బాటలు వేశాడు. దినేష్ కార్తీక్, విరాట్ కోహ్లీ, సురేష్ రైనా వికెట్లను రషీద్ కుప్పకూల్చాడు. తొలుత టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా ఆదిలోనే తొలి వికెట్‌ను రోహిత్ శర్మ రూపంలో కోల్పోయింది. 18 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ 5.4 ఓవర్‌లో కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి డేవిడ్ విల్లే బౌలింగ్‌లో మార్క్‌వుడ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. జట్టు స్కోరు 6 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 13 పరుగులు చేసిన తరుణంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ బరిలోకి దిగాడు. స్టయిలిష్ బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్ క్రీజులో ఉన్నంతసేపూ ఏడు బౌండరీలతో మంచి ఫామ్‌ను కనబరచినప్పటికీ 17.4 ఓవర్‌లో స్టోక్స్ చేతిలో రనౌట్ అయ్యాడు. 49 బంతులు ఎదుర్కొన్న ధావన్ ఏడు బౌండరీలతో 44 పరుగులు చేశాడు. 22 బంతులు ఎదుర్కొన్న దినేష్ కార్తీక్ మూడు బౌండరీలతో 21 పరుగులు చేసి 24.2 ఓవర్‌లో ఆదిల్ రషీద్ చేతిలో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 25 ఓవర్లు ముగిసేసరికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. ఫస్ట్‌డౌన్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ తొలి దశలోనే (5.4 ఓవర్లలో) పెవిలియన్ దారిపట్టి నిరాశపరచడంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ తనకు అందిన బంతులను బౌండరీకి తరలించి జట్టులో కొంతసేపు ఉత్సాహం నింపాడు. లియామ్ ఫ్లంకెట్ 23.4 ఓవర్‌లో వేసిన బంతిని బౌండరీకి తరలించిన కోహ్లీ అర్ధ శతకం నమోదు చేశాడు. 72 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ ఎనిమిది బౌండరీలతో 71 పరుగులు చేసి 30.1 ఓవర్‌లో ఆదిల్ రషీద్ చేతిలో బౌల్డ్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సురేష్ రైనా నాలుగు బంతులు ఎదుర్కొని కేవలం ఒక పరుగు మాత్రమే చేసి 30.6 ఓవర్‌లో ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో జో రూట్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. ఆదిల్ రషీద్ వేసిన ఒకే ఓవర్‌లో విరాట్ కోహ్లీ, సురేష్ రైనా ఔటయ్యారు. కీలక సమయంలో 31 ఓవర్లలోనే ఐదు ప్రధాన వికెట్లు పడిపోవడంతో జట్టుపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. ఈ సమయంలో బరిలోకి దిగిన వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీతో జత కట్టిన హార్దిక్ పాండ్య పరుగులు తీసేందుకు ప్రయత్నించాడు. 21 బంతులు ఎదుర్కొన్న హార్దిక్ పాండ్య రెండు బౌండరీలతో 21 పరుగులు చేసి మార్క్‌వుడ్ బౌలింగ్‌లో 38.2 ఓవర్‌లో జొస్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. అప్పటికి జట్టు 40 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. క్రీజులో వచ్చినప్పటి నుంచి నిలకడగా ఆడుతున్న ధోనీ 66 బంతులు ఎదుర్కొని నాలుగు బౌండరీలతో 42 పరుగులు చేసి 45.5 ఓవర్‌లో డేవిడ్ విల్లే బౌలింగ్‌లో జొస్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. 35 బంతులు ఎదుర్కొన్న భువనేశ్వర్ కుమార్ ఒక బౌండరీ 21 పరుగులు చేసి డేవిడ్ విల్లే బౌలింగ్‌లో బెయిర్ స్టోకు క్యాచ్ ఇచ్చాడు. ఆఖరి నాలుగు ఓవర్లు మిగిలి ఉండగా 9వ బ్యాట్స్‌మన్‌గా బరిలోకి దిగిన శార్దూల్ ఠాకూర్ 13 బంతులు ఎదుర్కొని రెండు సిక్సర్లతో 22 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
ఇంగ్లాండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ 10 ఓవర్లలో 49 పరుగులు, డేవిడ్ విల్లే 9 ఓవర్లలో 40 పరుగులిచ్చి తలో మూడు వికెట్లు సాధించారు. మార్క్ ఉడ్‌కు ఒక వికెట్ దక్కింది. అనంతరం ప్రత్యర్థి తమ ముందు ఉంచిన 257 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లాండ్..... పరుగులు చేసింది. జానీ బెయిర్ స్టో 13 బంతులు ఎదుర్కొని ఏడు బౌండరీలతో 30 పరుగులు చేసి 4.4 ఓవర్‌లో ఎస్.ఎన్.్ఠకూర్ బౌలింగ్‌లో సురేష్ రైనాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. జాసన్ రాయ్ స్థానంలో మూడో వనే్డలోకి వచ్చిన జేమ్స్ విన్స్ రనౌట్ అయ్యాడు. ఇతను 27 బంతుల్లో ఐదు బౌండరీలతో 27 పరుగులు చేశాడు. ఇద్దరు ఓపెనర్లు ఔటైనా ఆ తర్వాత బరిలోకి దిగిన జో రూట్, కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూ జట్టును గెలిపించే కీలక బాధ్యతను పోషించారు. జోరూట్ 120 బంతులు ఎదుర్కొని 10 బౌండరీలతో సెంచరీ నమోదు చేయగా, 108 బంతులు ఎదుర్కొన్న మోర్గాన్ ఒక సిక్సర్, తొమ్మిది బౌండరీలతో 88 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ ఒక వికెట్ సాధించాడు.