క్రీడాభూమి

అన్ని విభాగాల్లో మెరుగవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లీడ్స్, జూలై 18: సమతుల్యత, సమష్టి కృషి ఒక్కటే టీమిండియా ముందున్న టాస్క్ అని స్కిప్పర్ విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో సమతుల్యత సాధించి, విజయం కోసం మరింత సమష్టి కృషి జరపాల్సి ఉందన్నాడు. వచ్చే ప్రపంచకప్ నాటికి తప్పిదాలను సరిదిద్దుకుంటామని కోహ్లీ వ్యాఖ్యానించాడు. ఇంగ్లాండ్‌తో వనే్డ ట్రై సరిస్‌ను 1-2తో పోగొట్టుకున్న అనంతరం కోహ్లీ ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘ప్రపంచకప్ నాటికి ఏయే అంశాల్లో మెరుగుదల సాధించాలో ఇలాంటి మ్యాచ్‌లతోనే తెలిసేది. ఏ ఒక్క విభాగంలోనో మెరుగ్గా ఉంటే విజయాలు సాధించలేం. అన్ని విభాగాల్లోనూ మెరుగుదలతోపాటు సమతుల్యత సాధిస్తేనే గెలుపు సాధ్యమవుతుంది’ అన్నాడు. ‘పరుగుల విషయంలో మరికొంత మెరుగు చూపించాల్సింది. మరో 30 పరుగులు అధికంగా చేసివుంటే, మ్యాచ్ మరో విధంగా ముగిసేదేమో’ అన్నాడు. ‘పిచ్ స్లోగా ఉంది. ఇంగ్లాండ్ స్పిన్నర్లు సమర్థమైన బౌలింగ్ చేశారు. విజయం వాళ్లవైపే ఉంది, అంగీకరించాలి’ అన్నాడు. ‘ఆదిల్ రషీద్ బంతుల్ని అండర్ 19 నుంచీ ఫేస్ చేస్తున్నా. అతను పరిణితి సాధించాడు’ అంటూ రషీద్‌కు కితాబునిచ్చాడు.
ఇంగ్లాండ్‌తో ఆడబోయే ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ కోసం బీసీసీఐ ఎంపిక చేసిన టీమిండియా జట్టు స్థిరమైన ఆటగాళ్లతో పటిష్టంగా ఉందన్నాడు. టెస్ట్ మ్యాచ్‌లు జాగ్రత్తగా ఆడాల్సి ఉందని అభిప్రాయపడ్డాడు. టీ-20, వనే్డ సిరీస్‌ల్లో అద్భుతంగా రాణించిన కుల్దీప్ జట్టులో ఉండటం కలిసొచ్చే విషయం అని కోహ్లీ అభిప్రాయపడ్డాడు.