క్రీడాభూమి

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో కోహ్లీ, బుమ్రాలే టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయి, జూలై 18: బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లీ, బౌలింగ్‌లో బుమ్రాలే ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్‌లో ఉన్నారు. భారత్- ఇగ్లాండ్ మధ్య వనే్డ ట్రై సిరీస్ ముగిసిన తరువాత బుధవారం ఐసీసీ ర్యాకింగ్స్ ప్రకటించింది. భారత పరుగులు యంత్రం కోహ్లీ అత్యధికంగా 911 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన మూడు వనే్డ మ్యాచ్‌ల్లో కోహ్లీ (75, 45, 71) 191 పరుగులు సాధించి కెరీర్‌లోనే తొలిసారి అత్యధిక పాయింట్లు సాధించుకున్నాడు. 1991లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ డీన్ జోన్స్ సాధించిన 918 పాయింట్లను అధిగమించిన కోహ్లీ, టాప్ ప్లేస్‌కు చేరుకున్నాడు. ఇక మూడో వనే్డలో శతకం సాధించి ఇంగ్లాండ్‌కు అజేయ విజయాన్ని అందించిన జో రూట్ ద్వితీయ స్థానంలో నిలిచాడు. భారత బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ నాలుగో స్థానంతో సరిపెట్టుకుంటే, శిఖర్‌ధావన్ 10, ధోనీ 14 స్థానాల్లో కోనసాగుతున్నారు. కాగా బౌలింగ్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన వనే్డ సీరిస్‌లో రాణించిన భారత ఆటగాడు బుమ్రా ఆగ్రస్థానానికి చేరాడు. రషీద్ ఖాన్ రెండోస్థానంలో, చైనామన్ స్పిన్నర్ కల్దీప్ ఆరో స్థానంలో, చాహల్ పదోస్థానంలో కొనసాగుతున్నారు.