క్రీడాభూమి

పంచ్ అథ్లెటిక్ మీట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 19: ఫ్రాన్స్‌లో జరుగుతున్న సొట్టివిల్లే అథ్లెటిక్స్ మీట్‌లో భారత్ స్వర్ణ పతకం గెలుచుకుంది. జావెలిన్ త్రో ఫైనల్లో రికార్డు స్థాయిలో 85.17 మీటర్లు విసిరిన భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా స్వర్ణ పతకం చేజిక్కించుకున్నాడు. 2012 లండన్ ఒలింపిక్ విజేత చాంపియన్ వాల్కాట్ ఐదో స్థానంలో నిలిచాడు. నీరజ్ అద్వితీయమైన ప్రతిభను కనపరిచి జావెలిన్‌ను 85 మీటర్లు విసిరి రికార్డు నెలకొల్పాడు. మాల్దోవాస్ జావెలిన్ క్రీడాకారుడు ఆండ్రియన్ మర్దారే 81.48 మీటర్లు, లూథియానాకు చెందిన ఈడెన్ 79.31 మీటర్లు విసిరి ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచి రజిత, కాంస్య పతకాలు గెలుచుకున్నారు. 2016లో జరిగిన వరల్డ్ అండర్-20 అథ్లెటిక్ చాంపియన్‌షిప్‌లో జావెలిన్‌ను 86.48 మీటర్లు విసిరి ప్రపంచ రికార్డు నెలకొల్పిన నీరజ్ చోప్రా ఈ రికార్డును తిరగ రాయలేకపోయాడు. ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా గోల్డ్ కోస్ట్ కామనె్వల్త్ క్రీడల్లో 87.43 మీటర్లు విసిరి స్వర్ణ పతకం గెలుచుకున్న నీరజ్ తాజాగా 85.17 మీటర్ల దూరం విసిరి తాను నెలకొల్పిన రికార్డును అధిగమించలేకపోయాడు. ఫ్రాన్స్ అథ్లెటిక్ మీట్‌లో జావెలిన్ త్రోలో స్వర్ణ పతకం సాదించిన నీరజ్‌ను కోచ్, మాజీ ప్రపంచ జావెలిన్ త్రో రికార్డు గ్రహీత ఉవేజాన్ అభినందించాడు. స్వర్ణ పతకం సాదించిన నీరజ్ భవిష్యత్తులో గొప్ప అథ్లెట్‌గా ఎదిగి దేశానికి మరిన్ని పేరు ప్రతిష్టలు తేవాలని భారత అధ్లెటిక్ సమాఖ్య అధ్యక్షుడు అదీలే సుమరివాల అభిలషించాడు.