క్రీడాభూమి

సూర్యుడు మళ్లీ ఉదయిస్తాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఇంగ్లాండ్‌తో ఆగస్టు 1 నుంచి జరిగే ఐదు టెస్టు మ్యాచ్‌లలో తొలి మూడు మ్యాచ్‌లలో తనకు చోటుదక్కకపోవడంపై టీమిండియా ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ స్పందించాడు. ‘సూర్యుడు మళ్లీ రేపు ఉదయిస్తాడు’ అంటూ భారత్ జట్టులో చోటు దక్కకున్నా మళ్లీ అవకాశం వస్తుందంటూ పరోక్షంగా వ్యాఖ్యానిస్తూ ట్విటర్ వేదికగా పేర్కొన్నాడు.
ఇంగ్లాండ్‌తో తొలి మూడు టెస్టుల్లో ఆడే 18 మంది జట్టులో రోహిత్ శర్మకు తప్పనిసరిగా చోటు దక్కుతుందని చాలామంది క్రీడాపండితులు భావించారు. కానీ తుది జట్టు ఎంపికలో రోహిత్ శర్మ పేరు లేకపోవడంతో ఏమాత్రం ఆవేదన వ్యక్తం చేయకపోయినా మళ్లీ జట్టులో చోటు దక్కించుకుంటాననే ధీమాను వ్యక్తం చేశాడు. రోహిత్ శర్మ ఇంగ్లాండ్‌తో ఈ ఏడాది దక్షిణాఫ్రికాతో జరిగిన ఒక మ్యాచ్‌లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. కుడిచేతివాటం బ్యాట్స్‌మన్ అయిన రోహిత్ శర్మ ఆ మ్యాచ్‌లో 78 పరుగులు చేశాడు. అయితే, దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లలో ఆశించిన విధంగా ఆడలేదన్న కారణంతో జోహానె్నస్‌బర్గ్‌లో జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో అతనిని జట్టులోకి తీసుకోలేదు.
ఆ తర్వాత అఫ్గనిస్తాన్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో కూడా అతనికి చోటు దక్కలేదు. టీ-20లలో మూడు సెంచరీలు చేసిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. వనే్డలలో మూడు డబుల్ సెంచరీలు చేసిన ఘనత రోహిత్‌దే. 2013లో టెస్టు క్రికెట్‌లో అడుగుపెట్టిన 31 ఏళ్ల రోహిత్ 25 టెస్టుల్లో 1479 పరుగులు చేశాడు. స్వదేశంలో ఆడిన తొమ్మిది టెస్టుల్లో 769 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, ఐదు అర్ధ సెంచరీలు ఉన్నాయి. విదేశాల్లో ఆడిన 16 టెస్టులో 710 పరుగులతో చేశాడు.