క్రీడాభూమి

ఫైనల్‌కు లక్ష్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 21: ఆసియన్ జూనియర్ చాంపియన్‌షిప్ టోర్నీలో భారత రైజింగ్ షట్లర్, ఆరో సీడ్ లక్ష్య సేన్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. జకర్తాలో శనివారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఇండోనేసియా నాల్గవ సీడ్ ఇక్సన్ లియోనార్డో ఇమ్మాన్యుయెల్ రుంబేను మట్టికరిపించాడు. అటాకింగ్ గేమ్‌తో రుంబేను పూర్తిగా కట్టడి చేసిన లక్ష్య 21-7, 21-14 స్కోరుతో రెండు సెట్లు కైవసం చేసుకుని ఫైనల్‌కు చేరాడు. ఇదిలావుంటే, మరో సెమీఫైనల్ మ్యాచ్‌లో ఇండోనేసియాకు చెందిన టాప్‌సీడ్ కున్లవుట్ విదితిశరణ్ తన ప్రత్యర్థి, చైనాకు చెందిన మూడోసీడ్ షట్లర్ యుపెంగ్ బాయ్‌ని 21-14, 21-12 సెట్లతో ఓడించి ఫైనల్‌కు చేరాడు. నేడు జరగనున్న ఫైనల్ మ్యాచ్, టైటిల్ పోరులో టాప్‌సీడ్ విదితిశరణ్‌ను లక్ష్య సేన్ ఎదుర్కోబోతున్నాడు. ‘నా ఆట తీరు సంతృప్తికరంగా ఉంది. టైటిల్ పోరులో సైతం ఇదే టెంపో కొనసాగించగలనన్న నమ్మకంతో ఉన్నా. మ్యాచ్ కోసం ఉద్విఘ్నంగా ఎదురు చూస్తున్నా’ అంటూ లక్ష్య వ్యాఖ్యానించాడు.