క్రీడాభూమి

గురితప్పిన జ్యోతి- చేజారిన స్వర్ణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెర్లిన్, జూలై 21: ఆర్చరీ ప్రపంచ కప్ టోర్నీలో స్వర్ణానికి గురిపెట్టిన భారత్ రజితం, కాంస్యంతో సరిపెట్టుకుంది. పతకాలు రెండూ నాల్గవ దశలో కాంపౌండ్ విభాగంలోనే దక్కాయి. భారత మహిళా కాంపౌండ్ జట్టు మరోసారి ఫైనల్స్‌ను అధిగమించలేక రజిత పతకంతో సరిపెట్టుకుంది. ఫైనల్ పోరులో స్వర్ణం సాధించడం ఖాయమనుకున్న తెలుగమ్మాయి వనె్నం జ్యోతి సురేఖ చివరకు నిరాశనే మిగిల్చింది. ఫైనల్స్‌లో ఒకే ఒక్క పాయింట్‌తో ఆధిక్యంలో నిలిచిన ఫ్రాన్స్ మహిళల కాంపౌండ్ జట్టు చివరకు విజయాన్ని సొంతం చేసుకుంది. ఆర్చరీ ప్రపంచకప్ మహిళల కాంపౌండ్ విభాగంలో ముస్కాన్ కిరార్, త్రిషా డెబ్‌తో జతకట్టి ఫైనల్‌కు చేరుకున్న జ్యోతి, ఫ్రాన్స్‌తో శనివారం ఫైనల్ పోరు సాగించింది. తొలి దశలో 59-57తో లీడ్‌లోవున్న జ్యోతి జట్టు స్వర్ణం సాధించడం ఖాయమనే అంతా అనుకున్నారు. అయితే టోర్నీ ఫైనల్ పోరులో ఫ్రాన్స్ క్రీడాకారిణులు అత్యద్భుత ప్రదర్శనతో పాయింట్లను పరిగెత్తించారు. ఫ్రాన్స్ జట్టులోని సోఫీ డెడోమాంట్, అమేలీ సేన్స్‌నాట్, సాండ్రా హెర్వ్‌లు అనూహ్యంగా అధిగమించి 229-228 పాయింట్లతో భారత్‌కు నిరాశ మిగిల్చారు. దీంతో ఒక్క పాయింట్ వెనకపడిన భారత్ రజిత పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అలాగే కాంపౌండ్ మిక్స్‌డ్ పెయిర్ ఈవెంట్‌లో అభిషేక్ వర్మతో జతకట్టిన వనె్నం జ్యోతి, టర్కిష్ జట్టు యేసిమ్ బోస్టన్, డెమిర్ ఎల్మాగస్లిని 156-153తో ఓడించి కాంస్య పతకాన్ని చేజిక్కించుకున్నారు.