క్రీడాభూమి

‘హ్యాట్రిక్’పై డేర్‌డెవిల్స్ కన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో వరుసగా మూడో విజయంపై ఢిల్లీ డేర్‌డెవిల్స్ కనే్నసింది. మాజీ పేసర్ జహీర్ ఖాన్ నాయకత్వంలోని ఈ జట్టు తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఎదుర్కొని పరాజయాన్ని చవిచూసింది. అయితే, ఓటమికి కుంగిపోకుండా, తర్వాత రెండు మ్యాచ్‌ల్లో వరుసగా కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లను ఓడించింది. శనివారం డిఫెండింగ్ చాంపియన్ ముంబయి ఇండియన్స్‌నుకూడా చిత్తుచేసి, హ్యాట్రిక్ విజయాలను నమోదు చేయాలన్న పట్టుదలతో ఉంది. బౌలింగ్‌లో కొంత వెనుకబడినప్పటికీ, బలమైన బ్యాటింగ్ లైనప్‌తో జహీర్ బృందం నెట్టుకొస్తున్నది. పించ్ హిట్టర్ క్వింటన్ డి కాక్, జీన్ పాల్ డుమినీ, మాయాంక్ అగర్వాల్, టి-20 వరల్డ్ కప్ ఫైనల్ చివరి ఓవర్ మొదటి నాలుగు బంతులను సిక్సర్లుగా మలచి వెస్టిండీస్‌కు కప్‌ను అందించిన కార్లొస్ బ్రాత్‌వెయిట్, కరుణ్ నాయర్, సంజూ శాంసన్ వంటి మేటి బ్యాట్స్‌మెన్ అండ డేర్‌డెవిల్స్‌కు ఉంది. బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉన్నప్పటికీ, బౌలింగ్‌లో మాత్రం సమస్యలు ఎదుర్కొంటున్నది. జహీర్ అనుకున్న స్థాయిలో రాణించడం లేదు. ఈసారి ఐపిఎల్‌లో అత్యధిక ధర పలికిన భారత ఆటగాళ్ల జాబితాలో నంబర్‌వన్‌గా ఉన్న పవన్ నేగీ తనకు లభించిన మొత్తానికి ఏమాత్రం న్యాయం చేయడం లేదు. నాథన్ కౌల్టర్ నైల్, ఇమ్రాన్ తాహిర్, అమిత్ మిశ్రా, మహమ్మద్ షమీ తమను తాము నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. కాగా, ఈసారి ఐపిఎల్‌లో నిలకడలేని ఆటతో నిరాశ పరుస్తున్న ముంబయిని ఓడించే సత్తా డేర్‌డెవిల్స్‌కు ఉందని విశే్లషకుల అభిప్రాయం.
ఇక డిఫెండింగ్ చాంపియన్ ముంబయి విషయానికి వస్తే, రోహిత్ శర్మ కెప్టెన్సీలోని ఈ జట్టు నిలకడలేకుండా అడుతూ ప్రత్యర్థి జట్లనేగాక, అభిమానులను కూడా గందరగోళంలోకి నెడుతున్నది. ఇప్పటి వరకూ ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై సంచలన విజయాలను నమోదు చేసిన ముంబయికి రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్, గుజరాత్ లయన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో పరాజయాలు ఎదురయ్యాయి. పార్థీవ్ పటేల్, అంబటి రాయుడు, కీరన్ పోలార్డ్, కృణాల్ పాండ్య, జొస్ బట్లర్ తదితరులు బ్యాటింగ్ విభాగంలో కీలక పాత్రను పోషిస్తుండగా, హార్దిక్ పాండ్య, మిచెల్ మెక్‌క్లీన్‌గన్, హర్భజన్ సింగ్, వినయ్ కుమార్ రూపంలో సమర్థులైన బౌలర్లు ఉన్నారు. కాగితంపై బలంగా కనిపిస్తున్న ఈ జట్టు మైదానంలోకి దిగిన తర్వాత ఎప్పుడు, ఏ విధంగా రాణిస్తుందో అర్థంగాని పరిస్థితి. హ్యాట్రిక్ విజయాలపై కనే్నసిన డేర్‌డెవిల్స్‌ను ముంబయి ఎంత వరకు కట్టడి చేస్తుందో చూడాలి.
మ్యాచ్ శనివారం సాయంత్రం 4 గంటలకు మొదలు.