క్రీడాభూమి

అదే నా కల..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 22: హాల్ ఆఫ్ ఫేమ్ ఓపెన్ టోర్నీలో భారత సత్తా చాటాలని కలలుగంటున్నాడు చెన్నై టెన్నిస్ దిగ్గజం రామ్‌కుమార్ రామనాథన్. న్యూఢిల్లీలో ఆదివారం జరిగిన ఏటీపీ వరల్డ్ టూర్ సింగిల్స్ సెమీఫైనల్స్‌లో యూఎస్ ఆటగాడు టిమ్ స్మిక్‌జెక్‌ను 6-4, 7-5తో మట్టికరిపించి ఫైనల్స్‌కు చేరాడు. రామ్‌కుమార్ విజయంతో ఏటీపీ వరల్డ్ టూర్ సింగిల్స్‌లో ఏడోసారి భారత్ ఫైనల్‌కు చేరినట్టయ్యింది. ఫైనల్స్‌లో రామ్‌కుమార్ విజయం సాధిస్తే 20ఏళ్ల తరువాత టైటిల్ సొంతం చేసుకున్న భారత టెన్నిస్ ప్లేయర్‌గా రికార్డు కెక్కుతాడు. 1998లో లియాండర్ పేస్ ఏటీపీ వరల్డ్ టూర్ టైటిల్ సాధించిన తరువాత, భారత్‌కు మరో అవకాశం దక్కలేదు. 2001లో ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్‌కు చేరిన సోమ్‌దేవ్ దెవ్వర్‌మన్, తాజా వింబుల్డన్ రన్నరప్ కెవిన్ ఆండర్సన్ చేతిలో ఓడిపోవడం తెలిసిందే. ‘బలమైన సర్వీసులే చేసినా తొలి సెట్‌లో గొప్పగా ఆడలేకపోయాను. ముఖ్యంగా గ్రాస్ కోర్టుపై ప్రత్యర్థి ర్యాలీ ట్రికీ అని అర్థమైన తరువాత వెనుతిరిగి చూడలేదు. ఈ విజయం గొప్ప సంతోషాన్నిచ్చింది’ అని మ్యాచ్ అనంతరం వ్యాఖ్యానించాడు. ఫైనల్స్‌లో స్టీవ్ జాన్సన్‌ను రామనాథన్ ఎదుర్కోనున్నాడు.