క్రీడాభూమి

ప్రపంచ చాంప్‌లు అసల్, ఆరబి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, జూలై 23: డబ్య్లుఎస్‌ఎఫ్ -ప్రపంచ జూనియర్ స్క్వాష్ చాంపియన్లు (అండర్-19)గా భారత్‌కు చెందిన మోస్త్ఫా అసల్, రోవన్ రెడి ఆరబిలు నిలిచారు. చెన్నైలో జరుగుతోన్న టోర్నీలో ఈజిప్ట్‌కు చెందిన వరల్డ్ చాంపియన్ మార్వాన్ తరెక్‌ను 11-7, 13-11, 11-4 స్కోరుతో 45 నిమిషాల్లో మట్టికరిపించి భారత ఆటగాడు, సెకెండ్ సీడ్ మోస్త్ఫా అసల్ టైటిల్ దక్కించుకున్నాడు. మహిళా విభాగం సింగిల్స్‌లో ఈజిప్ట్‌కు చెందిన హనియా ఎల్ హమ్మమీని సునాయాసంగా ఓడించి స్ట్రెయిట్ గేమ్‌తో ఆరబి టైటిల్ దక్కించుకుంది.
పూల్-ఇలో భారత్
డబ్ల్యుఎస్‌ఎఫ్ -ప్రపంచ జూనియర్ స్క్వాష్ చాంపియన్‌షిప్ టీమ్ ఈవెంట్ నేటినుంచి మొదలవుతుంది. స్విట్జర్లాండ్, సౌదీ అరేబియాతోపాటు ప్రపంచ ఐదో ర్యాంకర్ భారత్ గ్రూప్ ‘ఇ’లో ఉంది. నేటినుంచి మొదలయ్యే టోర్నీ 29తో ముగియనుంది. గ్రూప్ మ్యాచ్‌ల్లో భారత్‌కు ఢోకాలేదని, టాప్ ఎయిట్‌కు చేరుకోవడం ఖాయమని జాతీయ కోచ్ సిరస్ పోన్చా ధీమా వ్యక్తం చేశాడు. అక్కడ, చెక్ రిపబ్లిక్ లేదా పాక్‌తో భారత్ ఆడాల్సి రావొచ్చని జాతీయ కోచ్ పోన్చా అంచనా వేస్తున్నాడు. ‘్భరత జట్టు పటిష్టంగా ఉంది. ఆటగాళ్లు ఫామ్‌లో ఉన్నారు. విజయం మనదే’నని ధీమా వ్యక్తం చేశాడు.