క్రీడాభూమి

ధోనీ సేన చిత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, ఏప్రిల్ 22: టీమిండియా పరిమత ఓవర్ల ఫార్మెట్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆధిపత్యాన్ని కనబరచాడు. ఐపిఎల్‌లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ధోనీ నాయకత్వం వహిస్తున్న రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్‌పై కోహ్లీ కెప్టెన్సీలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 13 పరుగుల తేడాతో గెలిచింది. 186 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైన ధోనీ సేన 20 ఓవర్లలో 8 వికెట్లకు 172 పరుగులు మాత్రమే చేయగలిగింది.
టాస్ గెలిచిన రైజింగ్ పుణె ఫీల్డింగ్ ఎంచుకుంది. బెంగళూరు ఇన్నింగ్స్‌ను ఆరంభించిన కోహ్లీ, లోకేష్ రాహుల్ మొదటి వికెట్‌కు 27 పరుగులు జోడించారు. ఏడు పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద రాహుల్ అవుట్‌కాగా, కోహ్లీతో కలిసిన డివిలియర్స్ చెలరేగిపోయాడు. అతని విజృంభణ కారణంగా కోహ్లీ నింపాదిగా బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. రెండో వికెట్‌కు 15.5 ఓవర్లలో 155 పరుగులు జోడించిన తర్వాత తిసర పెరెరా బౌలింగ్‌లో ఆజింక్య రహానే క్యాచ్ పట్టుకోగా కోహ్లీ పెవిలియన్ చేరాడు. అతను 63 బంతులు ఎదుర్కొని, ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 80 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ ముగియడానికి అప్పటికి ఇంకా మూడు బంతులే మిగిలి ఉన్నాయి. అయితే, తర్వాతి బంతికే డివిలియర్స్ కూడా అవుటయ్యాడు. అంకిత్ శర్మ క్యాచ్ అందుకోగా పెవిలియన్ చేరిన డివిలియర్స్ 46 బంతుల్లో, ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 83 పరుగులు సాధించాడు. చివరి రెండు బంతుల్లో బెంగళూరుకు మూడు పరుగులు లభించాయి. ఆ జట్టు 20 ఓవర్లలో మూడు వికెట్లకు 185 పరుగుల గౌరవ ప్రదమైన స్కోరు సాధించింది. అప్పటికి షేన్ వాట్సన్ (1), సర్ఫ్‌రాజ్ ఖాన్ (2) క్రీజ్‌లో ఉన్నారు. కూలిన బెంగళూరు మూడు వికెట్లు తిసర పెరెరా ఖాతాలోకి వెళ్లాయి.
స్టువర్ట్ బిన్నీ వేసిన మొదటి ఓవర్‌లోనే రైజింగ్ పుణె ఓపెనర్లు ఆజింక్య రహానే, ఫఫ్ డు ప్లెసిస్ 11 పరుగులు రాబట్టడంతో ఆ జట్టు వేట ధాటిగా మొదలైనట్టు కనిపించింది. కానీ, రెండో ఓవర్‌లోనే వికెట్ కూలింది. కేన్ రిచర్డ్‌సన్ బౌలింగ్‌లో హర్షల్ పటేల్ క్యాచ్ పట్టగా డు ప్లెసిస్ (2) పెవిలియన్ చేరాడు. ఫస్ట్‌డౌన్‌లో వచ్చిన కెవిన్ పీటర్సన్ కాలి కండరాలు బెణకడంతో అతను రిటైర్డ్‌హర్డ్ అయ్యాడు. అతని స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన స్టీవెన్ స్మిత్ (4) రనౌటయ్యాడు. 18 పరుగులకే అధికారికంగా ఇద్దరు, రిటైర్డ్ హర్ట్ అయిన పీటర్సన్‌తో కలిసి ముగ్గురు వెనుదిరిగిన స్థితిలో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్‌కు దిగాడు. రహానేతో అతని భాగస్వామ్యం బలపడుతున్నదన్న భయంతో మరోసారి స్టువర్ట్ బిన్నీని రంగంలోకి దించిన కోహ్లీ మూల్యాన్ని చెల్లించుకున్నాడు. మొదటి ఓవర్‌లో 11 పరుగులిచ్చిన బిన్నీ తన రెండో ఓవర్‌లో 12 పరుగులు సమర్పించుకున్నాడు. ధోనీతో భారీ భాగస్వామ్యాన్ని అందించేందుకు కృషి చేసిన రహానే 37 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. మొత్తం మీద 13.5 ఓవర్లలో రైజింగ్ పుణె వంద పరుగులు చేసింది. మూడో వికెట్‌కు 12.1 ఓవర్లలో 91 పరుగుల భాగస్వామ్యాన్ని అందించిన తర్వాత రహానే వెనుదిరిగాడు. అతను 46 ఓవర్లలో, 8 ఫోర్లతో 60 పరుగులు చేసి తబ్‌రైజ్ షంసీ బౌలింగ్‌లో లోకేష్ రాహుల్ స్టంప్ చేయడంతో అవుటయ్యాడు. జట్టును గెలిపించే బాధ్యత మీద పడడంతో ఒత్తిడికి గురైన ధోనీ 41 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద హర్షల్ పటేల్ బౌలింగ్‌లో డివిలియర్స్‌కు దొరికిపోయాడు. హర్షల్ పటేల్ తన చివరి ఓవర్‌లో ఏకంగా 25 పరుగులు సమర్పించుకోవడంతో మ్యాచ్ మళ్లీ రైజింగ్ పుణె వైపు మళ్లినట్టు కనిపించింది. చివరి రెండు ఓవర్లలో 25 పరుగులు అవసరమయ్యాయి. వాట్సన్ వేసిన 19వ ఓవర్‌లో తిసర పెరెరా అవుట్ కావడంతో రైజింగ్ పుణె కష్టాల్లో పడింది. కేవలం 13 బంతుల్లో 34 పరుగులు సాధించిన అతను మన్‌దీప్ సింగ్ క్యాచ్ అందుకోగా షేన్ వాట్సన్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. అదే ఓవర్‌లో హర్షల్ పటేల్‌కు చిక్కిన రవిచంద్రన్ అశ్విన్ డకౌటయ్యాడు. చివరి ఓవర్‌లో రైజింగ్ పుణె విజయానికి 21 పరుగుల దూరంలో నిలిచింది. కేన్ రిచర్డ్‌సన్ వేసిన ఆ ఓవర్‌లో రజత్ భాటియా (21), మురుగన్ అశ్విన్ (0) వికెట్లు చేజార్చుకొని ఏడు పరుగులు చేసింది. 20 ఓవర్లు ముగిసే సరికి ఎనిమిది వికెట్లకు 172 పరుగలు చేసిన రైజింగ్ పుణె 13 పరుగుల తేడాతో ఓడింది.
సంక్షిప్త స్కోర్లు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: 20 ఓవర్లలో 3 వికెట్లకు 185 (విరాట్ కోహ్లీ 80, ఎబి డివిలియర్స్ 83, తిసర పెరెరా 3/34).
రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్: 20 ఓవర్లలో 8 వికెట్లకు 172 (రహానే 60, ధోనీ 41, తిసర పెరెరా 34, రజత్ భాటియా 21).
--

* విరాట్ కోహ్లీ శుక్రవారం నాటి మ్యాచ్‌కి ముందు రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో మొత్తం 83 బంతులు ఎదుర్కొని 115 పరుగులు సాధించాడు. ఐపిఎల్‌లో ఒక బౌలర్‌పై వందకుపైగా పరుగులు సాధించి, ఒక్కసారి కూడా అతని బౌలింగ్‌లో అవుట్‌కాకుండా నిలిచిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ రికార్డు నెలకొల్పాడు.
* కోహ్లీ, డివిలియర్స్ భాగస్వామ్యంలో, 11.3 ఓవర్లలో బెంగళూరు వంద పరుగుల మైలురాయిని చేరింది. వీరిద్దరూ ఈ ఐపిఎల్ సీజన్‌లో వంద లేదా అంతకు పైగా పరుగులు జోడించడం ఇది మూడోసారి. మొత్తం మీద 11వసారి. కోహ్లీ/క్రిస్ గేల్ జోడీ 15 పర్యాయాలు, మురళీ విజయ్/ మైక్ హస్సీ జోడీ 13 పర్యాయాలు యాభైకి పైగా భాగస్వామ్యాలను అందించి కోహ్లీ/ డివిలియర్స్ జోడీ కంటే ముందున్నాయి.
--
chitram విరాట్ కోహ్లీ 63 బంతుల్లో 80 పరుగులు