క్రీడాభూమి

రియో ఒలింపిక్స్‌కు గుడ్‌విల్ అంబాసిడర్ సల్మాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ రియో ఒలింపిక్స్‌కు భారత్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియమితుడయ్యాడు. ఆగస్టులో జరిగే ఒలింపిక్స్‌కు భారత్‌లో అతను బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటాడని పోటీల నిర్వాహణ కమిటీ మహిళా బాక్సర్ మేరీ కోమ్, భారత హాకీ జట్టు కెప్టెన్ సర్దార్ సింగ్, మహిళా హాకీ క్రీడాకారిణి రీతు రాణి, ఆర్చర్ దీపికా కుమారి, షూటర్ అపూర్వీ చండీలా తదితరుల సమక్షంలో విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, ఈ అవకాశం దక్కినందుకు ఎంతో సంతోషిస్తున్నానని సల్మాన్ అన్నాడు. రియో ఒలింపిక్స్‌ను చూసేందుకు ఏదో ఒక సమయంలో వెళతానని చెప్పాడు. సానియా మీర్జా (టెన్నిస్), సుశీల్ కుమార్ (రెజ్లింగ్), విజేందర్ సింగ్ (బాక్సింగ్) అంటే తనకు ఎంతో ఇష్టమని అన్నాడు. ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న వారంతా పతకాలు సాధించి తిరిగి రావాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు.