క్రీడాభూమి

హోం గ్రౌండ్‌లో పుణె పరువు నిలిచేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణె, ఏప్రిల్ 23: హోం గ్రౌండ్‌లో ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగే ఐపిఎల్ మ్యాచ్‌లో రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్ జట్టు పరువు నిలబెట్టుకుంటుందా లేక మరో పరాజయాన్ని చవిచూస్తుందా అన్నది ఆసక్తి రేపుతోంది. పరిమిత ఓవర్ల ఫార్మెట్స్‌లో భారత్‌కు నాయకత్వం వహిస్తున్న మహేంద్ర సింగ్ ధోనీనే ఈ జట్టుకు కెప్టెన్ కావడం, ఐపిఎల్‌లో మొదటిసారి ఈ జట్టు అడుగుపెట్టడం ఉత్కంఠకు కారణాలు. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు సాధించిన నైట్ రైడర్స్‌ను నిలువరించడం పుణెకు అసాధ్యం కాకపోయినా సులభం మాత్రం కాదు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలబడిన రైజింగ్ పుణె సర్వశక్తులు ఒడ్డితేగానీ మళ్లీ ఫామ్‌లోకి వచ్చే అవకాశం లేదు. కాగితంపై మేటి ఆటగాళ్లు కనిపిస్తున్నప్పటికీ, నిలకడగా రాణించే వారు లేకపోవడంతో రైజింగ్ పుణె ప్రయాణం ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్నది. నైట్ రైడర్స్ పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. ఆదివారం నాటి మ్యాచ్‌లో హోరాహోరీ తప్పదని అంటున్న విశే్లషకులు నైట్ రైడర్స్‌కే విజయావకాశాలు ఎక్కువని జోస్యం చెప్తున్నారు.
మ్యాచ్ ఆదివారం రాత్రి 8 గంటలకు ఆరంభం.