క్రీడాభూమి

రోహిత్ శ్రమ వృథా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ చివరి క్షణం వరకూ పోరాడినప్పటికీ ఫలితం లేకపోయింది. ఢిల్లీ డేర్‌డెవిల్స్ నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని చేదించడంలో విఫలమైన ముంబయి పది పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. ఓపెనర్‌గా వచ్చిన రోహిత్ చివరి ఓవర్ మూడో బంతికి అవుటయ్యే వరకూ జట్టును గెలిపించేందుకు తీవ్రంగా శ్రమించాడు. అంతకు ముందు యువ ఆటగాడు సంజూ శాంసన్ అర్ధ శతకంతో రాణించడంతో డేర్‌డెవిల్స్ 164 పరుగులు సాధించగలిగింది. టాస్ గెలిచిన ముంబయి ఫీల్డింగ్‌ను ఎంచుకోగా, తొలుత బ్యాటింగ్‌కు దిగిన డేర్‌డెవిల్స్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. ఓపెనర్లు క్వింటన్ డికాక్ (9), శ్రేయాస్ అయ్యర్ (19), కరుణ్ నాయర్ (5) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరగా, సంజూ శాంసన్, జీన్‌పాల్ డుమినీ జట్టును ఆదుకున్నారు. 48 బంతులు ఎదుర్కొని, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో 60 పరుగులు సాధించిన శాంసన్‌ను టిమ్ సౌథీ క్యాచ్ పట్టగా మిచెల్ మెక్‌క్లీనగన్ అవుట్ చేశాడు. డుమినీ 31 బంతుల్లో అజేయంగా 49 పరుగులు చేశాడు. అతని స్కోరులో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. డేర్‌డెవిల్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 164 పరుగులు సాధించే సమయానికి డుమినీతోపాటు పవన్ నేగీ (10) నాటౌట్‌గా ఉన్నాడు. ముంబయి బౌలర్లలో మెక్‌క్లీనగన్ 31 పరుగులిచ్చి రెండు వికెట్లు కూల్చాడు. హార్దిక్ పాండ్య, హర్భజన్ ఇసంగ్ చెరొక వికెట్ సాధించారు.
కొంప ముంచిన రనౌట్లు
డేర్‌డెవిల్స్‌ను ఓడించేందుకు 165 పరుగులు చేయాల్సిన స్థితిలో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ముంబయిని రనౌట్లు కొంప ముంచాయి. జట్టు స్కోరు తొమ్మిది పరుగుల వద్ద పార్థీవ్ పటేల్ (1) రనౌటయ్యాడు. అంబటి రాయడు 23 బంతుల్లో 25, కృణాల్ పాండ్య 17 బంతుల్లో, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో 36 పరుగులు చేసి అవుటయ్యారు. జొస్ బట్లర్ (2), కీరన్ పోలార్డ్ (19), హర్భజన్ సింగ్ (0) తమ స్థాయికి తగినట్టు ఆడలేకపోయారు. చివరి ఓవర్‌లో 21 పరుగుల అవసరంకాగా, ముంబయి రెండు వికెట్లు కోల్పోయి పది పరుగులు చేసింది. విజయంపై ఆశలు పెంచిన రోహిత్ 48 బంతులు ఎదుర్కొని, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 65 పరుగులు సాధించి రనౌటయ్యాడు. ముంబయి 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 154 పరుగులు చేయగా, హార్దిక్ పాండ్య (2), టిమ్ సౌథీ (1) నాటౌట్‌గా నిలిచారు. డేర్‌డెవిల్స్ బౌలర్లలో అమిత్ మిశ్రాకు రెండు వికెట్లు లభించాయి. క్రిస్ మోరిస్, జహీర్ ఖాన్ చెరొక వికెట్ సాధించారు. డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్‌లో కీలక పాత్ర పోషించిన శాంసన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
సంక్షిప్త స్కోర్లు
ఢిల్లీ డేర్‌డెవిల్స్: 20 ఓవర్లలో 4 వికెట్లకు 164 (శ్రేయాస్ అయ్యర్ 16, సంజూ శాంసన్ 60, డుమినీ 49 నాటౌట్, మిచెల్ మెక్‌క్లీనగన్ 2/31).
ముంబయి ఇన్నింగ్స్: 20 ఓవర్లలో 7 వికెట్లకు 154 (రోహిత్ శర్మ 65, అంబటి రాయుడు 25, కృణాల్ పాండ్య 36, అమిత్ మిశ్రా 2/24).
* ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఆల్‌రౌండర్ జీన్‌పాల్ డుమినీ ఈ మ్యాచ్‌లో అజేయంగా 49 పరుగులు సాధించే క్రమంలో టి-20 మ్యాచ్‌ల్లో ఐదు వేల పరుగుల మైలురాయిని అధిగమించాడు. ప్రస్తుతం అతని ఖాతాలో 5,002 పరుగులున్నాయి. ఈ ఫీట్ సాధించిన 17వ బ్యాట్స్‌మన్‌గా అతను రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు.
ఈ మ్యాచ్‌సహా గత 12 మ్యాచ్‌ల్లో ఛేజింగ్ చేసిన జట్లు పది పర్యాయాలు గెలుపొందగా, కేవలం రెండోసారి ఒక జట్టు ఛేజింగ్‌లో విఫలమైంది.
ముంబయి ఇండియన్స్‌పై డేర్‌డెవిల్స్ ఆధిపత్యాన్ని సంపాదించింది. ఈ మ్యాచ్‌కి ముందు ఇరు జట్లు 16 మ్యాచ్‌ల్లో తలపడగా చెరి ఎనిమిది విజయాలు సాధించాయి. ఈ విజయంతో డేర్‌డెవిల్స్ తొమ్మిదో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. డేర్‌డెవిల్స్ ఓపెనర్ శ్రేయాస్ అయ్యర్ గత మూడు ఇన్నింగ్స్‌లో కేవలం 12 బంతులు ఎదుర్కొన్నాడు. వరుసగా 0, 3, 0 చొప్పున పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో అతను 20 బంతులు ఎదుర్కొని, ఒక ఫోర్, ఒక సిక్సర్‌తో 19 పరుగులు సాధించాడు.

చిత్రం ఐపిఎల్‌లో అత్యధిక సంఖ్యలో అర్ధ శతకాలు సాధించిన బ్యాట్స్‌మన్‌గా గౌతం గంభీర్, డేవిడ్ వార్నర్‌తో కలిసి రికార్డును పంచుకుంటున్న రోహిత్ శర్మ