క్రీడాభూమి

షకీబ్ చేతి వేలికి శస్తచ్రికిత్స

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బంగ్లాదేశ్, ఆగస్టు 9: చేతి వేలికి తగిన గాయంతో చాలాకాలంగా బాధపడుతున్న బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షాకీబ్ అల్ హసన్ సెప్టెంబర్ 15 నుంచి 28 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో జరిగే ఆసియా కప్ టోర్నమెంట్‌లో ఆడే అవకాశం లేనట్టే. ఈ ఏడాది జనవరిలో శ్రీలంకతో జరిగిన ఒక వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో షాకీబ్ ఎడమచేతి చిటికిన వేలికి గాయమైంది. ఆ తర్వాత అదే జట్టుతో జరిగిన వనే్డ ఇంటర్నేషనల్ సిరీస్‌తోపాటు టెస్టు మ్యాచ్, ట్వంటీ-ట్వంటీ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అయితే, వైద్యుల పర్యవేక్షణలో వేలికి శస్తచ్రికిత్స జరిపిన తర్వాత ఈ ఏడాది మార్చిలో శ్రీలంకతో జరిగిన నిదహాస్ ట్రోఫీతో మళ్లీ జట్టులోకి వచ్చాడు. ఆ తర్వాత వెస్టిండీస్‌తో ఇటీవల జరిగిన ట్వంటీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో ఆడినపుడు గాయం మరింత వేధించడంతో మళ్లీ శస్తచ్రికిత్స చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రానున్న ఆసియా కప్‌లో షాకీబ్ ఆడే అవకాశం లేనట్టే. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ శస్తచ్రికిత్స తర్వాత ఫిట్నెస్‌పరంగా ఆడగలనన్న నమ్మకం వస్తే ఆసియా కప్‌లో ఆడతానని స్పష్టం చేశాడు.