క్రీడాభూమి

వర్షం బెడద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, ఆగస్టు 9: లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్-్భరత్ మధ్య గురువారం జరుగనున్న రెండో టెస్టుకు వరుణుడు ఆటంకం కలిగించాడు. బుధవారం రాత్రి నుంచే లండన్‌లో జోరుగా వర్షం కురుస్తుండడంతో ఇరు జట్ల ఆటగాళ్లు బుధవారం కనీసం సాధన (వార్మప్) చేయలేకపోయారు. ఆకాశం మేఘావృతం కావడంతోపాటు గాలులు వీయకపోవడంతో వాతావరణం చల్లగా ఉంది. అయితే, వాతావరణంలో మార్పు రాకపోతుందా అని నిర్వాహకులు యోచిస్తున్నా ఫలితం లేకపోయింది. దీంతో నిర్ణీత సమయం కంటే అర గంట ముందుగానే భోజన విరామ సమయం ప్రకటించారు. అనంతరం టీ బ్రేక్ టైమ్‌కల్లా వర్షం కాస్త తగ్గుముఖం పట్టడంతో ఎంపైర్లు మైదానాన్ని పరిశీలించి, గ్రౌండ్ సిబ్బందితో మాట్లాడారు. లండన్‌లో నీటి పారుదల వ్యవస్థ మెరుగ్గా ఉండడంతో మైదానంలో నీరు నిలిచిపోయే అవకాశం లేదు. మైదానాన్ని కవర్లు కప్పి ఉంచారు. వర్షం కారణంగా తొలిరోజు రెండు సెషన్లు వృథా అయ్యాయి. ఇదిలావుండగా, తొలి టెస్టు మ్యాచ్‌ను 31 పరుగుల తేడాతో ఆతిధ్య జట్టు గెల్చుకుని ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.