క్రీడాభూమి

మార్పులకు శ్రీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) ఆమోదించిన కొత్త నిబంధనావళికి సుప్రీం కోర్టు సానుకూలంగా స్పందంచడం హర్షణీయమని బోర్డు పాలనా వ్యవహారాల బృందం (సీఓఏ) వ్యాఖ్యానించింది. దేశంలో క్రికెట్ ప్రక్షాళనకు లోధా కమిటీ చేసిన సూచనలను అమలు చేసేందుకు ఇప్పుడు మార్గం సుగమమైందని పేర్కొంది. బోర్డు కార్యవర్గ సభ్యులుగా ఎవరైన వరుసగా రెండుసార్లు ఎన్నికైతే, చివరిదైన మూడో టెర్మ్ ఆరంభానికి ముందు తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవడానికి ఉద్దేశించిన ‘కూలింగ్ ఆఫ్’ పీరియడ్‌ను అమలు కావడం గొప్ప పరిణామమని సీఓఏ చీఫ్ వినోద్ రాయ్ వ్యాఖ్యానించాడు. లోధా సిఫార్సుల్లో మొదటి టెర్మ్ పూర్తయిన వెంటనే ‘కూలింగ్ ఆఫ్’ మొదలుకావాలని ఉందని, అయితే, రెండో టెర్మ్ తర్వాత దానిని అమలు చేయడంపై తనకు ఎలాంటి అసంతృప్తి లేదని స్పష్టం చేశాడు. నిజానికి తాను కూడా రెండో టెర్మ్ పూర్తయిన తర్వాత ‘కూలింగ్’ పీరియడ్ ఉండాలని అభిప్రాయపడినట్టు తెలిపాడు. అయితే, అప్పట్లో తన ప్రతిపాదనపై ఏకాభిప్రాయం కుదరలేదని అన్నాడు.
బీసీసీఐ నిబంధనావళిని అమలు చేసేందుకు గడువును విధించడం వల్ల, అన్ని సభ్య సంఘాలు రాబోయే బోర్డు కార్యవర్గ ఎన్నికల్లో పారదర్శకంగా భాగస్వాములవుతాయని వినోద్ రాయ్ అన్నాడు. బీసీసీఐ కొత్త నిబంధనావళిని ఆమోదించకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని సభ్య సంఘాలకు సుప్రీం కోర్టు హెచ్చరికలు జారీ చేయడంపై సీఓఏ చీఫ్ ఆనందం వ్యక్తం చేశాడు. ‘లోధా కమిటీ సిఫార్సులను బీసీసీఐ, దాని సభ్య సంఘాలు అమలు చేసే విషయంలో ఇప్పుడు పూర్తి స్పష్టత వచ్చింది. తదుపరి చర్యలు తీసుకోవడానికి మార్గం మరింత సులభమైంది’ అని వ్యాఖ్యానించాడు. బీసీసీఐలో మొదటి నుంచి ఉన్న సంఘాలన్నిటికీ ఓటు హక్కు లభించడం కూడా తనకు ఆనందాన్నిచ్చిందని అంటూ, ‘ఒక రాష్ట్రానికి ఒకే ఓటు’ అనే లోధా కమిటీ సిఫార్సుపై సుప్రీం కోర్టు ఒత్తిడి చేయకపోవడాన్ని పరోక్షంగా ప్రస్తావించాడు. ప్రతి సభ్యుడికీ ఓటు హక్కు ఉండాలన్నదే తన అభిప్రాయమని, సుప్రీం కోర్టు ఆదేశాలతో అది సాధ్యమవుతుందని పేర్కొన్నాడు. సభ్య సంఘాలన్నీ నిబంధనావళిని అంగీకరిస్తూ నెల రోజుల్లోగా తీర్మానాలను ఆమోదించాల్సి ఉందని, అలా చేయని పక్షంలో తాము కోర్టును ఆశ్రయిస్తామని వినోద్ రాయ్ స్పష్టం చేశాడు. సీఓఏ సభ్యురాలు, భారత మాజీ మహిళా క్రికెటర్ డయానా ఎడుల్జీ కూడా సుప్రీం కోర్టు ఆదేశాలను స్వాగతించింది. ఈ తీర్పు ఎంతో సంతృప్తికరంగా ఉందని వ్యాఖ్యానించింది. లోధా కమిటీ సిఫార్సులను బీసీసీఐ, దాని అనుబంధ సంఘాలతో అమలు చేయించడమే తమకు కేటాయించిన బాధ్యతని ఆమె గుర్తుచేసింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో తమ పని సులభమవుతుందని చెప్పింది. భారత క్రికెట్‌కు ఈ తీర్పు కొత్త దిశానిర్దేశనం చేస్తుందని అభిప్రాయపడింది.
చిత్రం.. వినోద్ రాయ్