క్రీడాభూమి

...లాభంగా రండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 10: పొరుగూళ్లో పరువుగా ఉండండి. భారత గౌరవం ఇనుమడించేలా బాధ్యతతో మెలగండి’ అంటూ ఆసియా గేమ్స్ బృందానికి సాదర సూచనలు చేశారు కేంద్ర మంత్రి రాజ్యవర్థన్ రాధోడ్. ఇండోనేసియాలోని జకర్తా, పాలెంబాగ్‌లో ఆగస్టు 18నుంచి మొదలవుతున్న ఆసియా గేమ్స్‌లో పాల్గొంటున్న భారత బృందానికి భారత ఒలింపిక్ సమాఖ్య శనివారం ఢిల్లీనుంచి సాదర వీడ్కోలు ఏర్పాటు చేసింది. క్రీడోత్సాహంతో పతకాల వేటకు బయలుదేరిన 572మంది అథ్లెట్లు సహా 800మంది భారత బృందానికి ఈ సందర్భంగా మంత్రి రాజ్యవర్ధన్ కొన్ని సూచనలు చేశారు. ‘ప్రతిష్టాత్మక ఆసియా గేమ్స్‌లో దేశంనుంచి ప్రాతినిథ్యం వహించే అవకాశం దక్కడం మీ కృషి, అదృష్టం. క్రీడల్లోగాని, క్రీడా ప్రాంగణంలోగాని వ్యక్తిగత ప్రాధాన్యతలు వదలిపెట్టి ‘్భరత ప్రతినిధి’గానే మెలగండి’ అంటూ మంత్రి సూచించారు. ‘నిజానికి మీకిదో సవాల్. కోట్లాది జన బలానికి ప్రతీకలుగా పొరుగూళ్లో అడుగుపెడుతున్నారు. ఉత్తమ ఫలితాలతో తిరిగొచ్చే చివరి క్షణం వరకూ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని బాధ్యతగా మెలగాలి’ అని సూచించారు. ‘ఏళ్ల తరబడి మీ సామర్థ్యానికి సాన పెట్టుకున్నారు. ఆ ప్రతిభను ప్రదర్శించే సందర్భం వచ్చింది. ఫలితాలు, పతకాలపై ఆత్రుతో ఎక్కువ వత్తిడికి గురికాకుండి. మీ సామర్థ్యాలను స్వేచ్ఛగా, ఏకాగ్రతతో ప్రదర్శించండి చాలు. గతంకంటే ఈసారి ఉత్తమ ఫలితాలు, ఎక్కువ పతకాలు సాధించగలరన్న నమ్మకం దేశానికి కుంది. భారత క్రీడా పౌరుషం ఎంత గొప్పదో మీరు ప్రపంచానికి చాటిచెప్పే తీరును ఇక్కడినుంచే చూస్తుంటాం’ అంటూ ధైర్యం నూరిపోశారు. దేశ గౌరవాన్ని ఇనుమడించగల సత్తావున్న అథ్లెట్లను ఎంపిక చేయడం దగ్గరినుంచి, వారి సామర్థ్యాలకు మరింత పదును పెట్టేవరకూ భారత ఒలింపిక్ సమాఖ్య చేసిన అకుంఠిత కృషిని ఈ సందర్భంగా ప్రశంసించారు. వచ్చే ఏడాది నుంచి క్రీడలను పాఠ్యప్రణాళికలో భాగం చేయడానికి ప్రభుత్వం చేస్తోన్న కృషి, ప్రయత్నాలను ఈ సందర్భంగా మంత్రి రాజ్యవర్ధన్ మరోసారి గుర్తు చేశారు. కార్యక్రమంలో ఐఒఏ అధ్యక్షుడు నరీందర్ బాత్రా, సెక్రటరీ జనరల్ రాజీవ్ మెహతా, ఇండియన్ కాంటింజెంట్ చెఫ్ బ్రిజ్ భూషణ్ హాజరయ్యారు.

చిత్రం..ఆసియా గేమ్స్ ఆతిథ్య దేశం ఇండోనేసియాకు బయలుదేరిన భారత అథ్లెట్ల బృందం