క్రీడాభూమి

కుప్పకూలారు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్: భారత్- ఇంగ్లాండ్ రెండో టెస్ట్ రెండో రోజు వరుణుడి దోబూచులాట మధ్య మొదలైంది. ఆలస్యంగా మొదలైన మ్యాచ్‌లో 107 పరుగులకే భారత్ ఆలౌటై దారుణ స్థితిలో వుంది. ఓపెనర్ల నుంచి మిడిల్ ఆర్డర్ వరకూ బ్యాట్స్‌మెన్లు దారుణంగా విఫలమయ్యారు. మురళీ విజయ్ (0-5బంతులు), లోకేష్ రాహుల్ (8-14 బంతుల్లో), ఛతేశ్వర్ పూజారా (1-25 బంతుల్లో), విరాట్ కోహ్లీ (23-57 బంతుల్లో), హార్దిక్ పాండ్యా (11-10 బంతుల్లో), దినేష్ కార్తీక్ (1-3 బంతుల్లో), అజింక్యా రహానే (18-44 బంతుల్లో), కుల్దీప్ యాదవ్ (0-8బంతుల్లో), రవిచంద్రన్ అశ్విన్ (29-38 బంతుల్లో) కుప్పకూలిపోయారు. మహ్మద్ షమి (10-3 బంతుల్లో), ఇషాంత్ శర్మలు క్రీజ్‌లో ఉన్నారు. జేమ్స్ ఆండర్సన్ 20 పరుగులిచ్చి 5 వికెట్లు, క్రిస్ వోక్స్ 19 పరుగులిచ్చి 2, శామ్ కుర్రన్ 26 పరుగులిచ్చి 1, స్టార్ట్ బ్రాడ్ 1 వికెట్ తీసుకున్నారు. తొలి రోజు ఆట మొదలుకాకుండా అడ్డుపడిన వరుణుడు, రెండో రోజూ ఆలస్యంగా మొదలైన మ్యాచ్ ముందుకు సాగకుండా దోబూచులాడాడు.
రెండో రోజూ వాన ఇబ్బందలు తప్పకున్నా, ఒకింత తెరిపివ్వడంతో టెస్ట్‌ను నాలుగు రోజులకే పరిమితం చేస్తూ అంపైర్లు మ్యాచ్ మొదలెట్టడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో మురళీ విజయ్, లోకేష్ రాహుల్, ఛతేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్యా రెహానె, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమి, ఇషాంత్ శర్మలతో తుది జట్టును ప్రకటించిన భారత్ ఫీల్డ్‌లోకి దిగింది. టాస్ నెగ్గిన ఇంగ్లాండ్ బౌలింగ్‌ను ఎంచుకోవడంతో మురళీ విజయ్, లోకేష్ రాహుల్ బ్యాటింగ్ ఓపెనర్లుగా దిగారు. కలిసొచ్చిన పిచ్‌మీద స్వింగ్ బాల్స్‌తో ఆరంభ ఓవర్లలోనే ఆండర్సన్ ఓపెనర్ల వికెట్లు కుప్పకూల్చడంతో, క్రీజ్‌లోకి ఛతేశ్వర్ పూజారా దిగాడు. మ్యాచ్‌తో మళ్లీ వరుణుడు దోబూచులాడటంతో కొద్దిసేపు ఆగిపోయింది. కొద్దిసేపటికే తెరిపివ్వడంతో మ్యాచ్ మొదలైంది. అదే ఓవర్‌లో పూజారా రనౌట్ కావడంతో భారత్ 15/3 స్కోరుతో సంకట స్థితిలో పడింది. ఆలస్యమైన మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్ లైనప్ కుప్పకూలిపోయింది.

చిత్రం..తొలి వికెట్ కూల్చిన ఆనందంలో ఇంగ్లాండ్ జట్టు