క్రీడాభూమి

పంజాబ్‌కు పరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొహాలీ, ఏప్రిల్ 24: గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా పరాజయాల బాటలో సాగుతున్న కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ సోమవారం హోం గ్రౌండ్‌లో ముంబయి ఇండియన్స్ నుంచి కష్టతరమైన పరీక్షను ఎదుర్కోనుంది. ఇప్పటి వరకూ ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో కేవలం ఒక విజయాన్ని మాత్రమే నమోదు చేయగలిగిన పంజాబ్ నాలుగు పరాజయాలను చవిచూసింది. ముంబయి పరిస్థితి అద్భుతంగా లేకపోయినప్పటికీ, హోం గ్రాండ్‌లో మ్యాచ్ ఆడుతున్న కారణంగా ఒత్తిడికి గురై పంజాబ్ మరో మ్యాచ్‌ని చేజార్చుకునే ప్రమాదం లేకపోలేదు. డేవిడ్ మిల్లర్ నాయకత్వంలోని పంజాబ్‌లో మురళీ విజయ్, మానన్ వోహ్రా, గ్లేన్ మాక్స్‌వెల్, షాన్ మార్ష్, మోహిత్ శర్మ, గుర్‌కీరత్ సింగ్ మాన్ వంటి మేటి ఆటగాళ్లు ఉన్నారు. అయితే, చాలా జట్టు ఎదుర్కొంటున్నట్టుగానే నిలకడలేమి సమస్య పంజాబ్‌ను కూడా వేధిస్తున్నది. మరోవైపు, రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ముంబయికి కృణాల్ పాండ్య రూపంలో సమర్థుడైన బ్యాట్స్‌మన్ లభించాడు. జొస్ బట్లర్, అంబటి రాయడు, కీరన్ పోలార్డ్, టిమ్ సౌథీ, జస్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్య కొరి ఆండర్సన్ వంటి సమర్థులు ఆ జట్టులో ఉన్నారు. అయితే, పంజాబ్ మాదిరిగానే ముంబయి కూడా సరైన దిశానిర్దేశనం లేక సాగుతున్నది. ఎవరికి వారు తమతమ వ్యక్తిగత ఆటకే ప్రాధాన్యం ఇవ్వడంతో జట్టు ప్రయోజనాలు దెబ్బతింటున్నాయన్న విమర్శ కూడా ఉంది. కాగితంపై చూస్తే పంజాబ్ కంటే ముంబయి కొంత మెరుగ్గా కనిపిస్తున్నది. పంజాబ్ తీవ్రమైన ఒత్తిడికి గురైతే, దానిని అవకాశంగా తీసుకొని ముంబయి దాడికి ఉపక్రమించే అవకాశాలున్నాయి. మొత్తం మీద హోం గ్రౌండ్‌లో పంజాబ్‌కు పరీక్ష తప్పదు.