క్రీడాభూమి

కథ ముగిసింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెయ్యి ఏనుగుల్ని తిన్న రాబంధు సైతం ఒక్క గాలివానకు కుప్పకూలుతుంది. ఇది తెలుగు నానుడి. వెయ్యి టెస్ట్‌లాడిన ఇంగ్లీష్ జట్టు టీమిండియా ముందు మోకరిల్లుతుంది. ఇది సిరీస్ ఆరంభంలో క్రికెట్ నానుడి. కాకపోతే, ఇక్కడ టీమిండియా గాలివాన కాలేదు. వెయ్యి టెస్ట్‌లు ఆడిన ఇంగ్లీషోళ్లు రాబంధులూ కాలేదు. పైగా సీన్ రివర్స్ అయ్యింది. ఆశలు, అంచనాలు వాస్తవాలు కాజాలవన్న విషయం రెండో టెస్ట్ పూర్తయ్యేసరికి అర్థమైంది. ఇంగ్లీషోళ్లు రాబంధులు కాదు, గాలివానకు కూలిపోడానికి. వాళ్లు తటాకంలో మొసళ్లు. సొంతగడ్డమీద అద్వితీయ బలాన్ని ప్రదర్శించి రెండో టెస్ట్‌లోనూ భారత్‌ను కుప్పకూల్చారు. టెస్ట్ మ్యాచ్‌ల్లో తమకు తిరుగులేదన్న చారిత్రక వాస్తవాన్ని బర్మింగ్‌హామ్‌లో మరోసారి బలంగా చాటుకున్నారు.
*
మలి ఇన్నింగ్స్ మిగిలే ఉంది. ఇంగ్లీష్ జట్టు మాత్రం కథ ముగించేసింది. సెకండ్ టెస్ట్‌లోనూ పరాజయ పరాభవంతో టీమిండియాకు కన్నీరే మిగిలింది. లార్డ్స్ మైదానంలో లాయల్ గేమ్ ఆడిన ఇంగ్లీషోళ్లు సిరీస్ కైవసానికి రెండు టెస్ట్‌ల ‘రూట్’ వేసుకున్నారు. క్రిస్‌వోక్స్ (137) అజేయ సెంచరీ, బెయిర్ స్టో (93) పరుగుల పరాక్రమం ఇంగ్లాండ్‌ను శిఖరాగ్రానికి చేరిస్తే... స్టువార్డ్ బ్రాడ్ ఇన్, ఔట్ స్వింగర్లు, జేమ్స్ ఆండర్సన్ లైన్ అండ్ లెంగ్త్ బంతులు కోహ్లీ సేనను పాతాళానికి తొక్కేశాయి. తొలి ఇద్దరూ జట్టుకు గెలుపుబాటలేస్తే.. మలి ఇద్దరూ పక్కాగా కోహ్లీసేన పతనాన్ని శాసించారు.
*
లండన్, ఆగస్టు 12: ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో రెండో టెస్టునూ ఇంగ్లాండ్ తన వశం చేసుకుంది. ఇన్నింగ్స్ మిగిలి ఉండగానే 159 పరుగుల ఆధిక్యంతో భారత్ పరాజయాన్ని శాశించింది. సిరీస్‌లో తొలి టెస్ట్‌తో వెయ్యో మైలురాయిని టచ్‌చేసి విజయానందం పొందిన ఇంగ్లీష్ జట్టు, సిరీస్ గెలుపునకు కంకణం కట్టారన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంది. టీమిండియా సీన్ ఇందుకు భిన్నం. ఎడ్జ్‌బాస్టన్‌లో ఎదురైన పరాజయ పరాభవానికి ప్రత్యర్థిపై ప్రతీకారం తీర్చుకోలేకపోయింది. శత వైఫల్యాలతో లార్డ్స్‌లోనూ పరాజయాన్ని పునరావృతం చేసుకుంది.
ఓవర్‌నైట్ స్కోరు 357/6తో నాలుగోరోజు ఆదివారం ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు 396/7 స్కోరు వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. క్రిస్ వోక్స్ (137) అజేయ సెంచరీ, జానీ బెయిర్‌స్టో పరాక్రమ పరుగులు ఇంగ్లాండ్‌ను భారీ ఆధిక్యస్థాయికి తీసుకెళ్లాయి. వీరిద్దరికీతోడు చివరి ఓవర్లలో శామ్ కురన్ (40-49) సైతం చెలరేగిపోవడంతో ఇంగ్లాండ్‌కు తిరుగులేకుండా పోయింది. తొలి ఇన్నింగ్స్‌లో 289 పరుగుల ఆధిక్యాన్ని భారత్ ముందుంచింది. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌కు పూర్తిగా సహకరించిన వరుణుడు, భారత్ సెకెండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టేసరికి మరోసారి దోబూచులాట మొదలెట్టాడు. అవాంతరాల మధ్యే భారత్ బ్యాటింగ్ మొదలైంది. మళ్లీ కలిసొచ్చిన వాతావరణంలో స్టువార్ట్ బ్రాడ్ (4 వికెట్లు), జేమ్స్ ఆండర్సన్ (4 వికెట్లు) రెచ్చిపోయారు. ఇన్, ఔట్ స్వింగర్లు, లైన్ అండ్ లెంగ్త్ బంతులతో టీమిండియా పతకాన్ని శాశించారు. తొలి ఇన్నింగ్స్‌లో 107 పరుగులకే ఆలౌట్ అయిన కోహ్లీ సేన, మలి ఇన్నింగ్స్‌లో 130 పరుగులకే ఆలౌటైంది. అయితే, ఈసారీ టీమిండియాకు ఓపెనింగ్ కష్టాలు తప్పలేదు. పరుగుల ఖాతా తెరవకుండానే జేమ్స్ ఆండర్సన్ బంతికి ఓపెనర్ మురళీ విజయ్ (0- రెండు ఇన్నింగ్స్‌లోనూ డకౌట్) బెయిర్ స్టోకు క్యాచ్ ఇచ్చేశాడు. 6.1 ఓవర్ వద్ద లోకేష్ రాహుల్ (10-16 బంతులు) ఆండర్సన్ ఇన్‌స్వింగర్‌కు ఎల్‌బిడబ్ల్యుతో వెనుతిరిగాడు. 18.5 ఓవర్ వద్ద బ్రాడ్ బంతికి దొరికిన అజింక్యా రెహానే (13-33) జెన్నింగ్స్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అప్పటికి భారత్ స్కోరు 35/3గా ఉంది. ఛెతేశ్వర్ పూజారా (17-87) నిలదొక్కుకుంటున్న సమయంలో బ్రాడ్ బంతికి వికెట్ల ముందు దొరికిపోయి బౌల్డ్ అయ్యాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ (17-29) సైతం బ్రాడ్‌కు దొరికిపోవడంతో టీమిండియా టాప్ ఆర్డర్ కుప్పకూలినట్టయ్యింది. దీంతో మిడిలార్డర్, టైలెండర్లు సైతం వరుసకట్టేశారు. హార్దిక్ పాండ్యా (26-43), దినేష్ కార్తీక్ (0-1), రవిచంద్ర అశ్విన్ (33-48 నాటౌట్), కులదీప్ (0-7), మహ్మద్ షమి ((0-3), ఇషాంత్ శర్మ (2-7) వికెట్లు కుప్పకూలిపోయాయి.