క్రీడాభూమి

బీసీసీఐ గుర్రు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 13: ఇంగ్లీష్ జట్టుపై టీమిండియా తడబాటు వ్యవహారంలో చీఫ్ కోచ్ రవిశాస్ర్తీ, కెప్టెన్ విరాట్ కోహ్లీని బీసీసీఐ ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండు టెస్టుల్లో ఘోర వైఫల్యాలపై గుర్రుగావున్న బీసీసీఐ, నాట్టింగ్‌హామ్‌లో శనివారం నుంచి మొదలవుతున్న మూడో టెస్ట్ పూర్తయ్యేవరకూ ఓపికపట్టనున్నట్టు తెలుస్తోంది. థర్డ్ టెస్ట్‌లో కోహ్లీ కంపెనీ ప్రదర్శించే యాక్షన్‌బట్టే బీసీసీఐ ఫైనల్ రియాక్షన్ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ‘ఈసారి వాళ్లు సాకులతో సమర్థించుకునే అవకాశం లేదు. టైట్ షెడ్యూల్ కారణంగానే సౌతాఫ్రికా టెస్ట్‌లో విఫలమయ్యామని అప్పుడు సమర్థించుకున్నారు. ఇప్పుడా చాన్స్ లేదు. ఈసారి జట్టుతో మాట్లాడిన తరువాత షెడ్యూల్ ఫిక్స్ చేశాం. ప్రాక్టీస్ మ్యాచ్‌లకు ఏర్పాట్లు చేశాం. సిఫార్స్ చేసిన ఆటగాళ్లకు స్థానం కల్పించాం. బోర్డు ఏం చేయాలో అంతా చేసింది. కానీ, మ్యాచ్‌ల ఫలితాల్లోనే మార్పులేదు. ఈ పరిస్థితిని ఉపేక్షించలేం’ అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. కోచ్ శాస్ర్తీకి, కెప్టెన్ కోహ్లీకి అపరిమత స్వేచ్ఛనివ్వడం కూడా కొంపమునిగిన వ్యవహారానికి కారణంగా బీసీసీఐ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే థర్డ్ టెస్ట్‌లో సరైన ఫలితం రాబట్టకుంటే షోకాజ్‌లు తప్పవన్న వాదన వినిపిస్తోంది. అంతేకాదు శాస్ర్తీ, కోహ్లీ స్వేచ్ఛకు కత్తెరపడే అవకాశాలూ లేకపోలేదంటున్నారు. థర్డ్ టెస్ట్ ఫలితాన్నిబట్టే తరువాతి టెస్టులకు జట్టు ఎంపికలు మారొచ్చన్న కథనాలూ బీసీసీఐ కారిడార్లలో చక్కర్లు కొడుతుండటం గమనార్హం.