క్రీడాభూమి

మెట్టుదిగాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, ఆగస్టు 13: పరాక్రమ విరాటుడు టెస్ట్ క్రికెట్ టాప్ మెట్టునుంచి ఒక మెట్టు కిందికిదిగాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో ఆడిన ఇన్నింగ్స్‌తో టాప్‌కు ఎదిగిన కోహ్లీ, లార్డ్స్‌లో విస్మయపర్చిన ఇన్నింగ్స్‌తో ద్వితీయానికి దిగిపోయాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో పేలవమైన ప్రదర్శన ఇచ్చిన విరాట్ కోహ్లీ, తాజాగా ఐసీసీ ప్రకటించిన ర్యాంకుల్లో ద్వితీయస్థానానికి పరిమితమయ్యాడు. కాకపోతే రెండు ఇన్నింగ్స్‌లో నాటౌట్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచిన రవిచంద్రన్ అశ్విన్ (29, 33) మాత్రం 67 నుంచి 57వ ర్యాంకుకు ఎదిగాడు. బౌలింగ్ వింగ్‌లో మంచి ఫాం ప్రదర్శించిన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా 25 ర్యాంకులు అధిగమించి 74వ స్థానానికి చేరాడు.