క్రీడాభూమి

టి-20 వరల్డ్ కప్ క్రికెట్‌లో పాక్ పాల్గొనాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, డిసెంబర్ 13: భారత్‌లో వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో జరిగే టి-20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ జట్టు పాల్గొనాలని మాజీ కెప్టెన్ వసీం అక్రం పిలుపునిచ్చాడు. ద్వైపాక్షిక సిరీస్‌పై భారత్ ఇంకా స్పష్టత ఇవ్వలేదన్న కారణంగా టి-20 వరల్డ్ కప్ నుంచి వైదొలిగే ఆలోచన చేయకూడదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) అధికారులకు సూచించాడు. ఇక్కడ జరిగిన ఒక ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన అక్రం విలేఖరులతో మాట్లాడుతూ టి-20 వరల్డ్ కప్ టోర్నీని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) నిర్వహిస్తున్నదనే విషయాన్ని మరచిపోకూడదని అన్నాడు. ఆటగాళ్లకు చక్కటి అవకాశం రావాలన్నా, అనుభవం పెరగాలన్నా ఇలాంటి అంతర్జాతీయ పోటీలకు హాజరుకావాల్సిందేనని చెప్పాడు. పాకిస్తాన్, భారత్ దేశాల మధ్య దైపాక్షిక క్రికెట్ సంబంధాలు మెరుగుపడాలని తాను కోరుకుంటున్నానని అన్నాడు. క్రీడలను రాజకీయాలతో ముడిపెట్ట వద్దని కోరాడు.

వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్
ఒకుహరాకు టైటిల్
దుబాయ్, డిసెంబర్ 13: అంతర్జాతీయ బాడ్మింటన్ సమాఖ్య (బిడబ్ల్యుఎఫ్) వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను నొజోమీ ఒకుహరా కైవసం చేసుకుంది. హోరాహోరీగా సాగిన తుది పోరులో ఆమె ఇహాన్ వాంగ్‌ను 22-20, 21-18 తేడాతో ఓడించింది. ఒకుహరాకు ఈఏడాది ఇదే తొలి మేజర్ టైటిల్ కావడం విశేషం. పురుషుల సింగిల్స్‌లో కెన్డో మొమొతా విజేతగా నిలిచాడు. ఫైనల్‌లో అతను విక్టర్ అక్సెల్సెన్‌ను 21-15, 21-12 తేడాతో చిత్తుచేశాడు. ఈ మ్యాచ్ కేవలం 38 నిమిషాల్లో ముగియడం విశేషం.
కాగా, మహిళల డబుల్స్‌లో లువో ఇంగ్, లువో యూ జోడీ 14-21, 21-9 తేడాతో మొదటి రెండు సెట్లలో క్రిస్టియానా పెడెర్సెన్, కామిల్లా రిటర్‌జో జోడీపై సమవుజ్జీగా నిలిచింది. అనంతరం మూడో సెట్‌లో 14-4 ఆధిక్యాన్ని సంపాదించింది. ఈ దశలో రిటర్ జో, పెడెర్సెన్ జోడీ పోటీ నుంచి తప్పుకోవడంతో మహిళల డబుల్స్ టైటిల్‌ను ఇంగ్, యూ జోడీ సొంతం చేసుకుంది. మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్‌లో క్రిస్ అడ్‌కాక్, గాబ్రియెల్ అడ్‌కాక్ జోడీకి టైటిల్ లభించింది. వీరు తుది పోరాటంలో కో సింగ్ హ్యున్, కిమ్ హనా జోడీని 21-14, 21-17 తేడాతో వరుస సెట్లలో ఓడించి టైటిల్ అందుకున్నారు. పురుషుల డబుల్స్ టైటిల్ మహమ్మద్ అషన్, హెండ్రా సెతియవాన్ జోడీ కైవసం చేసుకుంది. వీరు ఫైనల్‌లో చెయ్ బియావో, హాంగ్ వెయ్ జోడీని 13-21, 21-14, 21-14 ఆధిక్యంతో ఓడించారు.