క్రీడాభూమి

దీవిపై క్రీడాకాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* దేశాలనుంచి దిగుతున్న అథ్లెట్లు *భద్రతా బలగాల భారీ మోహరింపు
జకార్తా, ఆగస్టు 14: ఒకపక్క వేలాది అథ్లెట్లు సుమత్రా దీవిమీద దిగుతున్నారు. మరోపక్క ఆసియా గేమ్స్‌కు ఆతిథ్యమిస్తోన్న ఇండోనేసియా తుది ఏర్పాట్లలో బిజీగా ఉంది. లాంఛన ప్రారంభం మరో మూడు రోజుల దూరంలోవున్నా, ఇప్పటికే కొన్ని క్రీడల్లో కొన్ని జట్లు ప్రారంభ మ్యాచ్‌లు ఆడేస్తున్నాయి. ఒలింపిక్ తరువాత అంతటి ఖ్యాతి సంపాదించుకున్న ఆసియా క్రీడోత్సవ సంరంభం క్రమంగా ఊపందుకుంటుంది. గేమ్స్‌లో సత్తా చాటుకునేందుకు వివిధ దేశాల అథెట్లు ఇప్పటికే తమ తమ వ్యూహాలతో క్రీడా గ్రామంలో తమకు కేటాయించిన బ్లాకుల్లోకి చేరారు. ఒలింపిక్స్‌తో తులతూగేలా ఇంతటి భారీస్థాయిలో క్రీడా సంరంభాన్ని ఇండోనేసియా నిర్వహించడం ఇదే తొలిసారి. 16వేలమంది అథ్లెట్లు, అధికారులకు జకర్తా, పాలెంబాగ్‌లో సకల సౌకర్యాలు ఏర్పాటు చేసింది. 40 క్రీడల నిర్వహణకు అన్నీ సిద్ధం చేసింది. అటు టెర్రరిజం, ఇటు ట్రాఫికిజం నీలినీడలు ఈవెంట్‌పై ప్రభావం చూపకుండా జాగ్రత్తలు తీసుకుంది. ఇప్పటికే అనేకసార్లు ఏర్పాట్లను పర్యవేక్షించి సమీక్షించిన చీఫ్ ఆర్గనైజర్ ఎరిక్ తోహిర్ ‘సర్వం సిద్ధం’ అంటూ ప్రకటించడం తెలిసిందే. అకస్మాత్తుగా సమస్యలు తలెత్తినా అధిగమించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ఇప్పటికే ప్రకటించాడు. భద్రతా విషయాల్లోనూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పెద్దఎత్తున బలగాలను క్రీడా గ్రామం, పరిసరాల్లో మోహరిస్తున్నారు. జకార్తా, పాలెంబాక్‌లో భారీగా హోర్డింగులూ కనిపిస్తున్నాయి. ఆయా ప్రాంతవాసులూ క్రీడలు తిలకించేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఇదిలావుంటే, వచ్చే ఒలింపిక్‌లో అత్యథిక పతకాలు సాధించడానికి ఆసియా గేమ్స్‌ను కొన్ని దేశాలు వేదిక చేసుకుంటున్నాయి. జపాన్, సౌత్‌కొరియాలను తలదన్ని అత్యధిక పతకాల సాధనతో ప్రతిష్ట నిలుపుకోవాలని చైనా ఉవ్విళ్లూరుతోంది. ప్రారంభ వేడుకల్లో ఉత్తర కొరియాతో కలిసి పాల్గొంటున్న చైనా, మహిళల బాస్కెట్‌బాల్, సినోయింగ్, రోయింగ్ క్రీడాంశాల్లో ఉ.కొరియాతో కలిసి ఉమ్మడి జట్లను దించే ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఫుట్‌బాల్‌లో సత్తా చాటేందుకు దక్షిణ కొరియా ఉత్సాహం చూపుతుంటే, బంగారు పతకాల వేట సాగించేందుకు చైనా ఒలింపిక్ చాంపియన్ సున్ యాంగ్ ఉవ్విళ్లూరుతున్నాడు. సింగపూర్ ఒలింపిక్ బటర్‌ఫ్లై చాంపియన్ జోసెఫ్, స్క్వాష్‌లో మలేసియా లెజెండ్ నికోల్ డేవిడ్‌లు తన ప్రతిష్ట నిలుపుకోవాలన్న కసితో కనిపిస్తున్నారు. ఆసియా మార్షల్ ఆర్ట్స్ అయిన కురాష్, సాంబో, పెన్కాక్ సిలత్, ఈసారి సరికొత్తగా గ్లైడింగ్, జెట్-స్కైయింగ్ విభాగాలు ఆసక్తిరేపనున్నాయి.
మహిళా హ్యాండ్‌బాల్ జట్టు ఓటమి
ఆదిలోనే భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆసియా గేమ్స్ ఆరంభ మ్యాచ్‌ల్లో భాగంగా మహిళల హ్యాండ్‌బాల్ గేమ్‌లో కజకిస్తాన్ జట్టుపై భారత జట్టు 19-36 స్కోరుతో ఓటమి చవిచూసింది. గ్రూప్-ఎలో కజకిస్తాన్‌తో తలపడిన భారత్ తొరి అర్థ్భాగం గట్టి పోటీనిచ్చినా, ద్వితీయార్థంలో చేతులెత్తేసింది. భారత్ నుంచి రింపి 8, మనీందర్ కౌర్ 3 గోల్స్ సాధిస్తే, నిధి శర్మ, రితులు చెరి రెండు గోల్స్ సాధించారు.