క్రీడాభూమి

బుమ్రా వచ్చేస్తున్నాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్: బలహీనంగావున్న భారత జట్టుకు బూస్ట్‌లాంటి వార్త. పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయాల నుంచి కోలుకున్నాడు. పూర్తి ఫిట్‌నెస్‌తో ఎంపిక కమిటీకి అందుబాటులోకి వచ్చాడు. రెండు టెస్ట్‌ల లీడ్ సాధించిన ఇంగ్లాండ్‌తో నాటింగ్‌హామ్‌లో శనివారం మొదలయ్యే మూడో టెస్ట్ జట్టులో బుమ్రా ఆడే అవకాశం కనిపిస్తోంది. ఇంగ్లాండ్ సుదీర్ఘ టూర్‌కు ముందు డబ్లిన్‌లో ఐర్లాండ్‌తో ఆడిన టీ-20 సిరీస్ తొలి మ్యాచ్‌లో పేసర్ బుమ్రా ఎడమ చేతి బొటనవేలికి గాయమైంది. ప్రాక్చర్‌కు లీడ్స్‌లో శస్తచ్రికిత్స చేయించుకున్న బుమ్రా, విశ్రాంతి కోసం భారత్‌కు వచ్చేశాడు. దీంతో ఇంగ్లాండ్‌తో టీ-20, వనే్డ సిరీస్‌లకు బుమ్రా దూరంగానే ఉండాల్సి వచ్చింది. గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో టెస్ట్ సిరీస్‌లో మొదటి రెండు టెస్ట్‌ల్లోనూ బుమ్రాకు స్థానం దక్కలేదు. టూర్‌లో ఫస్ట్ లెగ్ మొత్తం నెట్ ప్రాక్టీస్‌కే పరిమితమైన బుమ్రా కోసం జట్టు ఎదురుచూస్తోంది. అయితే సెకండ్ టెస్ట్‌కు ముందు నెట్ ప్రాక్టీస్‌లో బుమ్రా చేతి వేలికి ప్లాస్టర్ లేకుండానే ప్రాక్టీస్ సెషన్ సాగించి తాను ఫిట్‌నెస్‌తో ఉన్నట్టు చాటుకున్నాడు. టీమిండియాకు మరో శుభవార్త ఏంటంటే, రవిచంద్ర అశ్విన్, హార్దిక్ పాండ్యాలు సైతం పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నట్టు ప్రకటన వెలువడటం. బౌలింగ్ చేసే చేతి భుజం నొప్పి కారణంగా లార్డ్స్ టెస్ట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్‌లో ఇబ్బందులు ఎదుర్కోవడం తెలిసిందే. గాయంతోనే అశ్విన్ రెండు ఇన్నింగ్స్‌లోనూ తన ఫాంను ప్రదర్శించాడు. ప్రస్తుత ఆశావహ వాతావరణంలో సారథి విరాట్ కోహ్లీ మాత్రం వెన్ను నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. థర్ట్ మ్యాచ్ మొదలయ్యే సరికి ఫిట్‌నెస్‌తో బరిలోకి దిగగలనని విరాట్ కోహ్లీ నమ్మకంగా చెబుతుండటం ఒకింత ఆనందకరం. మంగళవారం జిమ్ సెషన్‌కు కోహ్లీ సహా టీమిండియా హాజరైనట్టు తెలుస్తోంది. నూరుశాతం ఫిట్‌నెస్ సాధించేందుకు కోహ్లీ కసరత్తులు చేస్తున్నాడు. కోహ్లీ సేనకు పరిణామాలు అనుకూలంగా మారుతోన్న నేపథ్యంలో, థర్డ్ టెస్ట్‌లో విజయంతో విమర్శలకు సరైన సమాధానం చెప్పగలదన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.