క్రీడాభూమి

వాళ్లూ.. ఆటగాళ్లే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, ఆగస్టు 15: టీమిండియా మొత్తం విరాట్ కోహ్లీపైనే ఆధారపడిందన్న వ్యాఖ్యలు ఎంతమాత్రం సహేతుకం కాదని శ్రీలంక మాజీ స్కిప్పర్ కుమార్ సంగక్కర అన్నాడు. సరైన ప్రిపరేషన్ లేకపోవడం వల్లే ఇంగ్లాండ్‌తో ఆడిన తొలి రెండు టెస్టుల్లో భారత్ విఫలమైంది తప్ప, జట్టును తక్కువ అంచనా వేయొద్దన్నాడు. ‘జట్టు మొత్తం కోహ్లీపైనే ఆధారపడిందన్న వ్యాఖ్యలు ఇతర బ్యాట్స్‌మెన్లను అవమానించడమే. అద్భుతంగా ఆడుతోన్న విరాట్ బ్యాటింగ్‌ను కొనే్నళ్లుగా ఎంజాయ్ చేస్తున్నాం. అతనొక అద్భుత బ్యాట్స్‌మెన్, సందేహం లేదు. అలాగని మిగిలిన బ్యాట్స్‌మెన్లను తక్కువ చేయొద్దు. వాళ్లూ సరైన ఆటగాళ్లేనన్న విషయం రికార్డులే చెబుతున్నాయి’ అని పీటీఐ వద్ద సంగక్కర వ్యాఖ్యానించాడు. పూజారా, రహానే, కెఎల్ రాహుల్, మురళీ విజయ్, శిఖర్ ధావన్, దినేష్ కార్తీక్... ఎవ్వరినీ వేరు చేయలేం. అంతా గొప్ప ఆటగాళ్లే’నన్నాడు. ‘టీమిండియా ఇబ్బందులకు వాతావరణమూ ఓ కారణమే. ముఖ్యంగా రెండో టెస్ట్ ఇన్నింగ్స్‌లో భారత్ బ్యాటింగ్ సమయంలో ప్రతికూల వాతావరణం కనిపిస్తే, ఇంగ్లీష్ టీంకు పొడి వాతావరణం అనుకూలించింది’ అని సంగక్కర పేర్కొన్నాడు. భారత జట్టుకు సరైన ప్రిపరేషన్ లేకపోవడం ఒక కారణమైతే, సొంత గడ్డమీద పిచ్‌లను ఇంగ్లీష్ బౌలర్లు అద్భుతంగా ఉపయోగించుకోవడం వల్ల భారత సామర్థ్యంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయన్నాడు.