క్రీడాభూమి

కింకర్తవ్యం!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, ఆగస్టు 15: పడ్డవాడెప్పుడూ చెడ్డవాడు కాదంటారు పెద్దలు. వాళ్ల మాట నిజమవ్వాలంటే ట్రెంట్ బ్రిడ్జిలో టీమిండియా చేతనైన ఆటాడాలి. థర్డ్ టెస్ట్‌లో గౌరవప్రదమైన గెలుపు సాధించాలి. అందుకు కోహ్లీసేన సమాయత్తమైందా? అసలు సారథి కోహ్లీయే ఫిట్‌నెస్‌ను సాధిస్తాడా? రాణించే ఓపెనర్లు రంగంలోకి దిగుతారా? ప్రతికూల వాతావరణాన్ని భారత్ ఎదుర్కోగలుగుతుందా? ఇన్ని ప్రశ్నలు క్రికెట్ అభిమానులు మస్కిష్కాన్ని మధిస్తున్నాయి.
నాయకుడై నడిపస్తున్న కోహ్లీకి వెన్ను నొప్పి. ఇది షాకింగ్ న్యూసే. దొరికిన గడువులో ఫిట్‌నెస్ సాధిస్తానని నమ్మకంగానే చెబుతున్నా, ఎక్కడో చిన్న సంకోచం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడి తీరాల్సిందేనని సునీల్ గావస్కర్‌లాంటి వెటరన్ వీరులు సూచిస్తున్నా, ఆడాల్సింది కోహ్లీ కాబట్టి అతనే నిర్ణయించుకోవాలి. తేరుకోవడానికి చేస్తున్న కసరత్తులు ఫలిస్తే సరేసరి. లేకుంటే? ఈ అనుమానమే భయపెడుతుంది. నాయకుడు సీన్‌లోవుంటే సేనకు పెద్ద ప్రేరణ. గెలుపు అనివార్యమైన సమయంలో అతను లేకుంటే మాత్రం జట్టుకు పెద్ద దెబ్బే.
ఇక ప్రత్యర్థులను మానసికంగా ఎదుర్కోవాలంటే -ఓపెనర్లు రాణించడం ఒక్కటే మార్గం. ఇదే ఇప్పుడు భారత్‌ను కుంగదీస్తోంది. టెస్ట్ సిరీస్‌లో ఒక్క ఓపెనరూ రాణించలేకపోతున్నాడు. అలాగని భారత ఓపెనర్లు తక్కువేం కాదు. శిఖర్ ధావన్.. కెఎల్ రాహుల్.. మురళీ విజయ్.. వీళ్లంతా నిరూపించుకున్న ఆటగాళ్లే. ఇంగ్లాండ్‌లో చతికిలపడటమే పెద్ద సమస్యగా పరిణమించింది. ఆ వత్తిడిని ఎదుర్కోలేక మిడిలార్డర్ సైతం కుప్పకూలిపోతుంది. ఈ పరిస్థితిలో మూడో టెస్ట్‌ను ప్రస్తుత ఓపెనర్లే నిలబెడతారా? లేక నిలబెట్టేందుకు కొత్త ఓపెనర్లు రంగంలోకి దిగుతారా? అసలు ఓపెనర్లుగా ఎవరుంటారు? ఇదో తలనొప్పి. దీనికి దొరికే నివారణోపాయాన్ని బట్టే మిడిలార్డర్‌లో ఏమైనా మార్పులుంటాయా? కొత్తవాళ్లకు అవకాశం దక్కుతుందా? బ్యాటింగ్‌లో రాణించని బౌలర్ల సంఖ్యను కుదిస్తారా? అన్నది ఆధారపడి ఉంటుంది. ఒక్క అశ్విన్ వినా రెండో టెస్ట్‌లో రహానే, పూజారా, దినేశ్ కార్తీక్, హార్దిక్ విఫలమైన విషయాన్ని ఇక్కడ విస్మరించకూడదు.
ఇక పొట్ట్ఫిర్మాట్‌లో జట్టుకు పెద్ద దన్నుగా నిలిచిన విక్కీ దినేశ్ కార్తీక్, టెస్ట్ సిరీస్‌లో మాత్రం పేలవానే్న ప్రదర్శించాడు. సాహాకు శస్తచ్రికిత్సతో దక్కిన అవకాశాన్ని కార్తీక్ సమర్థంగా ఉపయోగించుకోలేక పోతున్నాడన్న వాదన ఉంది. ఈ నేపథ్యంలో కుర్ర కీపర్ రిషబ్ పంత్ అరంగేట్రానికి టెస్ట్ చాన్స్ ఇస్తారా? అన్నదీ కీలక విషయమే. మూడో టెస్ట్‌కు 36 గంటల ముందు టీమిండియా ముందున్న సవాళ్లివి. జట్టుగా ఎలా ఎదుర్కొంటారు.. జట్టుగా ఎలాంటి ఫలితాన్ని రాబడతారన్నది వేచి చూడాలి.