క్రీడాభూమి

భారత అథ్లెట్లపై గంపెడాశలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జకార్తా, ఆగస్టు 16: ఈనెల 18వ తేదీ నుంచి ఇండోనేషియాలోని జకార్తాలో భారీ ఎత్తున నిర్వహించే ఆసియా గేమ్స్‌లో పాల్గొనే భారత అథ్లెట్లపై అభిమానులు గంపెడాశలు పెట్టుకుంటున్నారు. రెజ్లింగ్, బాడ్మింటన్, షూటింగ్, అథ్లెటిక్స్, టెన్నిస్, బాక్సింగ్, జిమ్నాస్టిక్, టేబుల్ టెన్నిస్ తదితర అంశాల్లో జరిగే పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు గత ఒలింపిక్స్ పోటీల కంటే ఎక్కువగా పతకాలు సాధిస్తారనే గట్టి నమ్మకాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. రెజ్లింగ్‌లో పోటీపడే హర్యానాకు చెందిన 24 ఏళ్ల బజరంగ్ పూనియా ఈ ఏడాది పాల్గొన్న మూడు టోర్నమెంట్లలో విజయం సాధించాడు. ఆస్ట్రేలియా గోల్డ్ కోస్ట్‌లో ఇటీవల జరిగిన కామనె్వల్త్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్‌ను తన ఖాతాలో జమ చేసుకున్నాడు. ఆ తర్వాత జార్జియా, ఇస్తాంబుల్‌లో జరిగిన ఇంటర్నేషనల్ ఈవెంట్స్‌లో సైతం టైటిల్స్ సాధించాడు. ఇక మరో రెజ్లర్ సుశీల్ కుమార్ భారత్‌లో ఆరితేరిన ఒలింపియన్‌గా వినుతికెక్కాడు. ఇప్పటికే రెండుసార్లు ఒలింపిక్ పతక విజేతగా నిలిచాడు. నాలుగేళ్ల తర్వాత ఇటీవల జార్జియాలో జరిగిన ఒక పోటీలో నిరాశపరిచాడు. ప్రస్తుతం ఆసియా క్రీడల్లో తప్పనిసరిగా భారత్‌కు పతకం అందిస్తాడనే గట్టి నమ్మకాన్ని అభిమానులు కనబరుస్తున్నారు. ఇదే అంశంలో పోటీ పడే మరో రెజ్లర్ వినేష్ ఫొగట్. రియో ఒలింపిక్స్ సందర్భంగా కాలి వేలికి తగిన 2దెబ్బతో సతమతమైంది. కామనె్వల్త్ గేమ్సలో గోల్డ్ మెడల్‌తోపాటు మాడ్రిడ్‌లోని స్పెయిన్‌లో జరిగిన గ్రాండ్ ప్రిక్స్‌లో ఘన విజయాన్ని నమోదు చేసింది. ఇపుడు జకార్తాలో జరిగే ఆసియా గేమ్స్‌లో ఆమె 50 కేజీల విభాగంలో తప్పనిసరిగా మెడల్ సాధించవచ్చునని విశ్వసిస్తున్నారు. ఇక బాడ్మింటన్ మహిళల విభాగంలో పోటీపడుతున్న పీవీ సింధు కొద్దిరోజుల కిందట నాన్‌జింగ్‌లో జరిగిన ఫైనల్‌లో కరొలినా మారిన్ చేతిలో పరాజయంపాలై రజత పతకంతో సరిపెట్టుకుంది. ఆమె ఇంతవరకు ఆడిన నాలుగు ప్రధాన ఈవెంట్లలో ఫైనల్‌లో తృటిలో ఓటమిని చవిచూస్తోంది. ఆసియా గేమ్స్‌పై చక్కని ఆటతీరును కనబరుస్తుందని క్రీడాభిమానులు విశ్వసిస్తున్నారు. ఇదే విభాగంలో పోటీపడే మరో స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ పడుతూ లేస్తూ వస్తోంది. తన సత్తాతో ఈసారి భారత్‌కు పతకాన్ని తీసుకురానుంది. బాడ్మింటన్ పురుషుల విభాగంలో కామనె్వల్త్ గేమ్స్‌లో రజత పతకం అందుకున్న కిడాంబి శ్రీకాంత్ ఈ ఏడాది ఏప్రిల్‌లో పురుషుల సింగిల్స్‌లో ఫస్ట్ ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. ఆసియా గేమ్సలో చైనా, ఇండొనేషియా, జపాన్ షట్లర్‌తో పోటీ పడనున్నాడు. షూటింగ్ విభాగంలో పోటీపడుతున్న హర్యానాకు చెందిన మనూ బాకర్ 16 ఏళ్ల ప్రాయంలో ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్‌కప్‌లో తన అద్భుత ప్రదర్శనతో గోల్డ్ మెడల్ కైవసం చేసుకుని ఈ ఘనత సాధించిన పిన్నవయస్కురాలిగా రికార్డు సృష్టించింది. కామనె్వల్త్ గేమ్స్‌లో సైతం గోల్డ్ మెడల్ అందుకున్న మనూ బాకర్ ఆసియా గేమ్స్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో మరోసారి తన సత్తా చాటేందుకు సిద్ధమైంది. అథ్లెటిక్స్ అంశంలో మహిళల విభాగంలో పోటీపడుతున్న అసోంలోని మారుమూల గ్రామానికి చెందిన 20 ఏళ్ల హిమ దాస్ గోల్డ్ కోస్ట్ కామనె్వల్త్ గేమ్స్‌లో ఆరోస్థానాన్ని ఆక్రమించింది. ఐఏఏఎఫ్ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్‌లో 400 మీటర్ల పరుగు పందెం పోటీలో 51.59 నిమిషాల్లో చేరుకుని గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారత అథ్లెట్‌గా ఘనత సాధించింది. ఇపుడు జకార్తా ఆసియా క్రీడల్లో మరో పతకం సాధిస్తాననే గట్టి నమ్మకాన్ని ఆమె వ్యక్తం చేస్తోంది. ఇక జావెలిన్ త్రో అంశంలో పోటీపడే నీరజ్ చోప్రా 2016లో జరిగిన అండర్-20 పోటీల్లో పాల్గొని ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు. కామనె్వల్త్ గేమ్స్‌లో 86.47 మీటర్ల వరకు విసిరి గోల్డ్ మెడల్ అందుకున్నాడు. దోహాలో ఇటీవల జరిగిన ఐఏఏఎఫ్ డైమండ్ లీగ్‌లో పాల్గొని 87.43 మీటర్లతో తన వ్యక్తిగత రికార్డును తానే అధిగమించాడు. ఇటీవల కాలంలో ప్రాతినిధ్యం వహించిన నాలుగు ప్రధాన ఈవెంట్లలో మూడు గోల్డ్ మెడల్స్ దక్కించుకున్నాడు. ఆసియా క్రీడల్లో తప్పనిసరిగా భారత్‌కు మరో గోల్డ్ మెడల్ అందించే అవకాశం లేకపోలేదని అభిమానులు గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. మహిళల డిస్కస్ త్రోలో పోటీపడుతున్న 35 ఏళ్ల సీమా పూనియా సైతం భారత్‌కు తప్పనిసరిగా మెడల్ అందించే అవకాశం ఉంది. అయితే, ఆమె ఆసియా గేమ్స్‌లో చైనాకు చెందిన బలమైన ప్రత్యర్థితో తలపడాల్సి ఉంటుంది. పరుగు పందెం అంశంలో పోటీపడుతున్న ఒడిశాకు చెందిన 22 ఏళ్ల దుతీ చంద్ సీఏఎస్ ఈవెంట్‌లో అద్భుతంగా రాణించింది. సెమీఫైనల్స్‌లో తాను గతంలో నెలకొల్పిన జాతీయ రికార్డును అధిగమించి గోల్డ్ మెడల్ అందుకుంది. టెన్నిస్‌లో పురుషుల డబుల్స్ విభాగంలో బరిలోకి దిగుతున్న బెంగళూర్‌కు చెందిన రోహన్ బొపన్న, దివిజ్ శరణ్ జోడీపై అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. టెన్నిస్ సింగిల్స్‌లో యుకీ బాంబ్రి ప్రాతినిధ్యం వహించలేని పక్షంలో చెన్నై ఆడగాడు రామ్‌కుమార్ రామ్‌నాథన్ బరిలోకి దిగే అవకాశం ఉండడంతో భారత ఆశలు నిలబెడతాడని పలువురు నమ్ముతున్నారు. ఇక బాక్సింగ్‌లో పోటీపడుతున్న వికాస్ కృష్ణన్ రెండుసార్లు ఆసియా గేమ్స్‌లో పాల్గొని పతకాలు అందుకున్నాడు. గోల్డ్ కోస్ట్‌లో జరిగిన కామనె్వల్త్ గేమ్స్‌లో 75 కేజీల విభాగంలో గోల్డ్ మెడల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.
జకార్తా ఆసియా క్రీడల్లో భారత్ తరఫున పతకం సాధించే అథ్లెట్లలో వికాస్ ఒకడు. బాక్సింగ్స్‌లో పోటీపడుతున్న గౌహతికి చెందిన శివథాప కూడా ఆసియా గేమ్స్‌లో తప్పనిసరిగా మెడల్ సాధించే అవకాశం ఉందని క్రీడా పండితులు వ్యాఖ్యానిస్తున్నారు. బాక్సింగ్స్ మహిళల విభాగంలో దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్ హాజరుకాలేని పక్షంలో పోటీ పడుతున్న ముగ్గురు బాక్సర్లపై భారీగానే అంచనాలు ఉన్నాయి. జిమ్నాస్టిక్స్‌లో పోటీపడుతున్న దీపా కర్మాకర్ టర్కీలోని మెర్సిన్‌లో జరిగిన వరల్డ్ చాలెంజ్ కప్‌లో గోల్డ్ మెడల్ అందుకుంది. రియో ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంతో సరిపెట్టుకున్న దీపా ఆసియా గేమ్స్‌లో తప్పనిసరిగా భారత్‌కు పతకాన్ని అందించే అవకాశం ఉంది. టేబుల్ టెన్నిస్‌లో బరిలోకి దిగుతున్న మనీకా బాత్రా గోల్డ్ కోల్ట్‌లో అద్భుత ప్రదర్శన కనబరచి గోల్డ్ మెడల్ అందుకుంది. జకార్తాలో తన ప్రత్యర్థులతో గట్టి పోటీని ఎదుర్కోనుంది.

క్రీడా గ్రామంలో ఎగిరిన మువ్వనె్నల జెండా
జకార్తా, ఆగస్టు 16: ఇండోనేషియాలోని జకార్తాలో ఈనెల 18వ తేదీ నుంచి భారీ ఎత్తున ఆసియా క్రీడలు నిర్వహిస్తున్న నేపథ్యంలో గురువారం క్రీడా గ్రామంలో భారత్ తరఫున పాల్గొంటున్న పలువురు అథ్లెట్లు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.
ఇప్పటికే జకార్తాకు చేరుకున్న భారత హాకీ పురుషుల జట్టుతోపాటు రెజ్లర్లు అతి సాధారణంగా జరిగిన జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు భారత ఉన్నతాధికారులు పాల్గొని భారత అథ్లెట్లకు శుభాకాంక్షలు అందజేశారు. కాగా, ఆసియా క్రీడల్లో పాల్గొనే షటిల్ బాడ్మింటన్, కబడ్డీ, టెన్నిస్ క్రీడాకారులు గురువారం సాయంత్రానికి సింగపూర్ మీదుగా ఇండోనేషియా రాజధానికి చేరుకున్నారు.