క్రీడాభూమి

గుడ్‌విల్ అంబాసిడర్‌గా సల్మాన్ నియామకంపై నిరసనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: రియో ఒలింపిక్స్‌కు భారత్‌లో గుడ్‌విల్ అంబాసిడర్‌గా బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నియామకంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మాజీ అథ్లెట్ మిల్కా సింగ్, స్టార్ రెజ్లర్ యోగేశ్వర్ దత్ తదితరులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భారత ఒలింపిక్ సంఘం (ఐఒఎ) తీసుకున్న ఈ నిర్ణయం యావత్ క్రీడా ప్రపంచాన్ని కించ పరిచే విధంగా ఉందని లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత యోగేశ్వర్ ధ్వజమెత్తాడు. భారత దేశంలో ఎవరైనా సినిమాలను ప్రమోట్ చేసుకోవచ్చని, అయితే, సినిమా ప్రమోషన్‌కు ఒలింపిక్స్ వేదిక కారాదని వ్యాఖ్యానించాడు. ‘అసలు గుడ్‌విల్ అంబాసిడర్ చేయాల్సిన విధులు ఏమిటో ఎవరైనా నాకు చెప్తారా? ప్రజలను ఎందుకు పిచ్చివాళ్లను చేస్తున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. భారత క్రీడా రంగానికి పిటి ఉష, మిల్కా సింగ్ వంటి వారు ఉత్తమ సేవలు అందించారని, మరి సల్మాన్ క్రీడలకు చేసిన సేవలు ఏమిటని యోగేశ్వర్ నిలదీశాడు. భారత దేశానికి పతకాలు అవసరంగానీ స్పాన్సర్స్‌కాదని స్పష్టం చేశాడు.
క్రీడాకారులు కరవయ్యారా!
ఒలింపిక్స్‌కు గుడ్‌విల్ అంబాసిడర్‌గా వ్యవహరించేందుకు క్రీడాకారులే కరవయ్యారా అని 85 ఏళ్ల ‘్ఫ్లయింగ్ సిఖ్ చండీగఢ్‌లో విడుదల చేసిన ఒక ప్రకటనలో వ్యాఖ్యానించాడు. సల్మాన్ ఖాన్‌ను గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియమిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశాడు. పిటి ఉష, రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, అజిత్ పాల్ సింగ్ వంటి ఎంతో మంది క్రీడా ప్రముఖులు ఉండగా, వారిని కాదని బాలీవుడ్ నటుడు సల్మాన్‌కు పట్టం కట్టడంలో అర్థం ఏమిటని ప్రశ్నించాడు. తాను వ్యక్తిగతంగా సల్మాన్‌కు వ్యతిరేకిని కానని అన్నాడు. అయితే, క్రీడా రంగంలో సల్మాన్ పాత్ర ఏమీ లేదన్నది వాస్తవమని పేర్కొన్నాడు. ఎంతో మంది క్రీడా ప్రముఖులు ఉండగా, వారిని ఏమాత్రం పట్టించుకోకుండా, సల్మాన్‌ను ఎంపిక చేయడం తనకు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని చెప్పాడు. సినిమా రంగంలో జరిగే ఎనైనా మెగా ఈవెంట్‌లో క్రీడాకారులలకు ఇలాంటి పదవులు కట్టబెట్టారా? అని ప్రశ్నించాడు. ఐఒఎ తక్షణమే తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.