క్రీడాభూమి

గురి కుదిరింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాలెంబాగ్, ఆగస్టు 20: షూటింగ్ వీరులు దీపక్ కుమార్, లక్ష్యే శరణ్‌లు 10మీటర్ల ఎయిర్ రైఫిల్, 10మీటర్ల పురుషుల ట్రాప్ ఈవెంట్లలో రజతాలు సాధించి భారత పతకాల సంఖ్యను పెంచారు. ప్రతిష్మాత్మక ఈవెంట్‌లో పతకం కోసం 33ఏళ్ల దీపక్ కుమార్ ఎక్కువకాలం ఎదురుచూడాల్సి వచ్చినా, లక్ష్యే మాత్రం గన్ పట్టిన నాలుగేళ్లలోపే గౌరవప్రద పతకం సాధించి భారత ప్రతిష్టను పెంచాడు. పురుషుల ట్రాప్‌లో చైనా తైపీ అథ్లెట్ కున్పి యాంగ్, దక్షిణ కొరియా ఆటగాడు డెమెయూంగ్ అన్‌లకు స్వర్ణం, కాంస్యం దక్కాయి. 10మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అశోక్ రజతాన్ని సాధిస్తే, చైనా డిఫెండిగ్ చాంప్ యాంగ్ హోరన్, చైనీస్ తైపీ అథ్లెట్ లూ ఊవోచిన్‌లు స్వర్ణం, కాంస్యం సొంతం చేసుకున్నారు.
బాడ్మింటన్ టీం ఈవెంట్‌లో స్వర్ణం ఖాయమనుకున్న భారత్ ఆశలు అడియాశలయ్యాయి. పురుషులు, మహిళా జట్లు ప్రత్యర్థుల ముందు పరాజయంతో తలొంచడంతో పతకానికి తావులేకుండా పోయింది. భారత మహిళా జట్టు టాప్ సీడ్స్ జపాన్ చేతిలో 1-3 స్కోరుతో ఓటమి చవిచూస్తే, పురుషుల జట్టు అంతే స్కోరుతో ఇండోనేసియా జట్టు చేతిలో ఓటమి చవిచూసింది.
ఏడుసార్లు స్వర్ణ పతకాలు సాధించిన భారత కబడ్డీ జట్టుకు తొలి లీగ్‌లో ఎదురుదెబ్బ తగిలింది. గ్రూప్- ఎలో ఆదివారం దక్షిణ కొరియాతో తలపడిన భారత జట్టు 23-24 స్కోరుతో ఓటమి చవిచూసింది. ఆసియా గేమ్స్ 28ఏళ్ల చరిత్రలో భారత కబడ్డీ జట్టుకు తగిలిన తొలి దెబ్బ ఇది. నేడు థాయిలాండ్ జట్టుతో భారత జట్టు తలపడనుంది. మహిళా విభాగానికి సంబంధించి భారత జట్టు తన విజయాలను కొనసాగిస్తోంది. గ్రూప్ మ్యాచ్‌ల్లో ఆదివారం థాయిలాండ్‌ను 33-23 స్కోరుతో మట్టికరిపించింది. నేడు శ్రీలంక జట్టును ఎదుర్కోనున్న భారత మహిళా జట్టు, తరువాత ఆతిథ్య దేశం ఇండోనేసియాతో తలపడనుంది.
ప్రత్యర్థి ఇరాన్‌ను ఓడించి సెమీస్‌కు చేరిన భారత సెపక్‌తక్రా జట్టు ఆసియా గేమ్స్‌లో పతకం సాధించటం ఖాయంగా కనిపిస్తుంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో 21-16, 19-21, 21-17 సెట్లతో ఇరాన్‌పై విజయం సాధించిన భారత పురుషుల జట్టు, ఇండోనేసియాపై 0-3తో ఓటమి చవిచూసింది. అయితే గత నాలుగు దశల్లో అడ్వాన్స్ సాధించిన జట్టుకు కనీసం రజత పతకమైనా దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంగళవారం డిఫెండింగ్ చాంపియన్స్ థాయిలాండ్‌ను భారత్ ఎదుర్కోనుంది.
భారత్ టెన్నిస్ స్టార్లు రామ్‌కుమార్ రామనాథన్, అంకిత రైనాలు శుభారంభ విజయాలతో ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరారు. తొలి మ్యాచ్‌కు బై సాధించిన వీళ్లిద్దరూ సోమవారం సింగిల్స్, డబుల్స్ మ్యాచ్‌లతో బిజీగా కనిపించారు. ప్రజ్ఞేష్ గునే్నశ్వరన్, కర్మన్ కౌర్ తండి సైతం తొలి మ్యాచ్‌ల్లో విజయాలు నమోదు చేశారు. పురుషుల డబుల్స్‌లో రామనాథన్, సుమిత్ నాగల్ ద్వయం విజయం సాధిస్తే, మహిళల డబుల్స్‌లో రితుజ బోంస్లే, ప్రన్జల యడ్లపల్లి ద్వయం నిరాశపర్చారు. మెన్స్ డబుల్స్‌లో టాప్ సీడ్స్ రోహన్ బోపన్న, దివిజి శరణ్ ద్వయం సోమవారం సాయంత్రం ఆడిన తొలి మ్యాచ్‌లో విజయం సాధించారు.
పురుషుల హాకీ గ్రూప్ మ్యాచ్‌లో ఆతిథ్య దేశం ఇండోనేసియాపై భారత జట్టు సునాయాస విజయం నమోదు చేసింది. ప్రత్యర్థి జట్టుకు అవకాశమే ఇవ్వకుండా 17-0స్కోరుతో మ్యాచ్‌ను పూర్తి చేసింది. భారత స్టార్ ఆటగాళ్లు దిల్‌ప్రీత్ సింగ్, సిమ్రన్‌జీత్ సింగ్, మన్‌దీప్‌సింగ్‌లు హ్యాట్రిక్ గోల్స్ నమోదు చేశారు. భారత జట్టు బుధవారం హాంకాంగ్ చైనాతో తలపడనుంది.
వుషూ ఈవెంట్‌లోనూ భారత్ అథ్లెట్లు సత్తా చూపుతున్నారు. పురుషుల సండా ఈవెంట్ 65 కేజీల విభాగంలో భారత అథ్లెట్ నరేందర్ ఫిలిఫ్పైన్స్ ప్రత్యర్థి జూ. తబుంగరను 2-1 స్కోరుతో ఒడించి క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నాడు. మంగళవారం ఉజ్బెకిస్తాన్ అథ్లెట్ రఖిమోవ్ అక్మల్‌తో క్వార్టర్స్‌లో తలపడతాడు.

చిత్రం..షూటింగ్‌లో పతకాలు సాధించిన
వెండికొండలు లక్ష్యయ్ షెరాన్, దీపక్ కుమార్