క్రీడాభూమి

పిల్లలతో ఆటలు.. సేవా కార్యక్రమాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 24: భారత మాజీ క్రికెటర్ సచిన్ తెండూల్కర్ ఆదివారం తన 43వ జన్మదినోత్సవాన్ని పిల్లలతో కొంత సేపు ఆడి, సేవా కార్యక్రమాల్లో పాల్గొని బిజీ బిజీగా గడిపేశాడు. 2013లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్ తర్వాత అన్ని ఫార్మెట్స్ నుంచి రిటైరైన సచిన్ తాను చిన్నప్పుడు ప్రాక్టీస్ చేసిన ముంబయిలోని ఎంఐజి క్లబ్‌కు వెళ్లి అక్కడ పిల్లలతో కొంత సేపు క్రికెట్ ఆడాడు. వారికి బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో సూచనలు ఇచ్చాడు. అనంతరం పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. కాగా, మాజీ క్రికెటర్ అనీల్ కుంబ్లే, ఓపెనర్ శిఖర్ ధావన్, బిసిసిఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్, ఐపిఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా, భారత క్రికెటర్ సురేష్ రైనా, ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్, పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ సక్లెయిన్ ముస్తాక్, భారత ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ సింగ్ తదితరులు సచిన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.