క్రీడాభూమి

విజయాల బాట పట్టేందుకు.. పుణె ప్రయోగాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణె, ఏప్రిల్ 25: న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టెఫెన్ ఫ్లెమింగ్ కోచ్‌గా, పరిమిత ఓవర్ల ఫార్మెట్స్‌లో టీమిండియాకు నాయకత్వం వహిస్తున్న మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నప్పటికీ పుణె రైజింగ్ సూపర్‌జెయింట్స్ అద్భుతాలేవీ సృష్టించడం లేదు. ఈసారి ఐపిఎల్‌లో కొత్తగా అడుగుపెట్టినప్పటికీ, కెప్టెన్, కోచ్‌తోపాటు చాలా మంది ఆటగాళ్లు కూడా పాతకాపులే. ఎనిమిది సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ధోనీ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అదే జట్టు తరఫున ఆడిన ఫ్లెమింగ్ కోచ్‌గా సేవలు అందించాడు. ఆజింక్య రహానే, ఫఫ్ డు ప్లెసిస్, ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్, మిచెల్ మార్ష్, రవిచంద్ర అశ్విన్, ఇశాంత్ శర్మ, ఈశ్వర్ పాండే, తిసర పెరెరా, రజత్ భాటియా వంటి అనుభవజ్ఞుల అండ జట్టుకు ఉంది. కానీ, నాలుగు వరుస పరాజయాలు పుణె ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయి. దీనితో విజయాల బాటను ఎక్కేందుకు ఈ జట్టు ప్రయోగాలు చేస్తున్నది.
మొట్టమొదటి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబయి ఇండియన్స్‌ను ఓడించిన పుణె శుభారంభం చేసింది. కానీ, ఆతర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో పరాజయాలను చవిచూసింది. ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌ని రెండు వికెట్ల తేడాతో చేజార్చుకుంది. అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ, ఒక కొత్త జట్టును బలమైన శక్తిగా తీర్చిదిద్దడం అనుకున్నంత సులభం కాదని కోచ్ ఫ్లెమింగ్ స్పష్టం చేస్తున్నాడు. కొన్ని మ్యాచ్‌లు ఓడడం కొంత ఇబ్బందికరమైన పరిస్థితులను సృష్టించినప్పటికీ, ఆ జ్ఞాపకాలను పక్కకుపెట్టి ముందుకు వెళ్లడమే తమ లక్ష్యమని పిటిఐతో మాట్లాడుతూ ఫ్లెమింగ్ చెప్పాడు. ఉత్తమ ఫలితాలను రాబట్టుకునే రీతిలో, జట్టు కూర్పుపై ప్రయోగాలు చేస్తున్నామని అన్నాడు. ఎన్నో కాంబినేషన్స్‌ను ప్రయత్నించిన తర్వాతే ఒక స్పష్టత వస్తుందని చెప్పాడు. పరాజయాలకు కారణాలను వెతుక్కోవడం లేదని, జట్టు మొత్తం సమష్టిగా బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నాడు. రాబోయే మ్యాచ్‌ల్లో ఎదురుదాడికి దిగి, విజయాలను సాధిస్తామని ధీమా వ్యక్తం చేశాడు.