క్రీడాభూమి

యూనిస్‌పై వేటు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, ఏప్రిల్ 25: పాకిస్తాన్ మాజీ కెప్టెన్ యూనిస్ ఖాన్‌పై వేటు ఖాయమైంది. పాకిస్తాన్ కప్ జాతీయ వనే్డ టోర్నమెంట్‌లో ఖైబర్ ఫక్తున్కవా జట్టుకు యూనిస్ నాయకత్వం వహిస్తున్నాడు. ఈటోర్నీలో భాగంగా ఒక గ్రూప్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు అంపైర్ తీసుకున్న నిర్ణయంపై యూనిస్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతేగాక, మ్యాచ్ రిఫరీ తీరును కూడా నిరసించాడు. అంతటితో ఆగకుండా టోర్నీని మధ్యలోనే విడిచిపెట్టి, ఫైసలాబాద్ నుంచి తన స్వస్థలమైన కరాచీకి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి అతని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసే ఉంది. యూనిస్‌తో మాట్లేండదుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) చైర్మన్ షహర్యార్ ఖాన్ స్వయంగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. యూనిస్ వైఖరిపై పిసిబి తీవ్ర అసంతృప్తితో ఉంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి, అంపైర్ నిర్ణయాన్ని ప్రశ్నించడమేగాక, టోర్నీ నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోవడాన్ని ఆక్షేపిస్తున్న పిసిబి అతనిపై మూడు నుంచి ఐదు మ్యాచ్‌ల సస్పెన్షన్ వేటు వేయడం ఖాయంగా కనిపిస్తున్నది. కాగా, యూనిస్ వివాదాల్లో చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు. గత సీజన్‌లో తాను పని చేస్తున్న యునైటెడ్ బ్యాంక్ అధికారులతో విభేదించిన అతను హఠాత్తుగా జట్టును విడిచి వెళ్లిపోయాడు. అనేక సందర్భాల్లో పిసిబిని, సహచరులను, కెప్టెన్‌ను, కోచ్‌ని విమర్శించి అతను వివాదాస్పద క్రికెటర్‌గా ముద్రపడ్డాడు.