క్రీడాభూమి

పరుగుల వేటలో పంజాబ్ విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్, ఏప్రిల్ 25: ఐపిఎల్‌లో సోమవారం డిఫెండింగ్ చాంపియన్ ముంబయిని ఇండియన్స్‌తో తలపడిన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ పరుగుల వేటలో విఫలమైంది. 190 పరుగుల భారీ లక్ష్యాన్ని చేదించేందుకు బ్యాటింగ్‌కు ఉపక్రమించిన పంజాబ్ 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 164 పరుగులు చేయగలిగింది. పార్థీవ్ పాటిల్ 81, అంబటి రాయుడు 65 పరుగులతో రాణించడంతో 20 ఓవర్లలో ముంబయి 6 వికెట్లకు 189 పరుగులు చేయగలిగింది. పంజాబ్ తరఫున షాన్ మార్ష్ 45, గ్లేన్ మాక్స్‌వెల్ 56 పరుగులతో రాణించినప్పటికీ, మిగతా వారు వేగంగా పరుగులను రాబట్టడంలో విఫలమయ్యారు. ఫలితంగా పంజాబ్‌కు 25 పరుగుల తేడాతో ఓటమి తప్పలేదు.
పంజాబ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆ నిర్ణయం సరైనదేనన్న అభిప్రాయం మొదటి ఓవర్ రెండో బంతికే ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ (0) అవుట్‌కావడంతో అందరికీ ఏర్పడింది. సందీప్ శర్మ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ నిఖిల్ నాయక్ క్యాచ్ అందుకోగా రోహిత్ పెవిలియన్ చేరాడు. ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన తెలుగు వీరుడు అంబటి రాయుడుతో కలిసి పార్థీవ్ పటేల్ ముంబయి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరు రెండో వికెట్‌కు 137 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని జత చేశారు. ఐపిఎల్ చరిత్రలో ఒక జట్టు పరుగుల ఖాతాను తెరవకుండానే మొదటి వికెట్ కోల్పోయిన తర్వాత రెండో వికెట్‌కు ఇదే అత్యధిక పార్ట్‌నర్‌షిప్ కావడం విశేషం. టి-20 ఫార్మెట్‌లో 3,000 పరుగుల మైలురాయిని అధిగమించిన భారతీయుల్లో ఐదో ఆటగాడిగా గుర్తింపు పొందిన రాయుడు 37 బంతుల్లోనే 65 పరుగులు సాధించి, అక్షర్ పటేల్ బౌలింగ్‌లో మానన్ వోహ్రా క్యాచ్ అందుకోగా వెనుదిరిగాడు. అతని స్కోరులో నాలుగు ఫోర్లు, మరో నాలుగు సిక్సర్లు ఉన్నాయి. జొస్ బట్లర్ 13 బంతుల్లో 24 పరుగులు చేసి మోహిత్ శర్మ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్‌కాగా, నాలుగో వికెట్‌గా పార్థీవ్ పెవిలియన్ చేరాడు. 58 బంతులు ఎదుర్కొన్న అతను 10 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 81 పరుగులు సాధించి, మిచెల్ జాన్సన్ బౌలింగ్‌లో మిచెల్ మార్ష్ క్యాచ్ అందుకోగా అవుటయ్యాడు. మోహిత్ శర్మ వేసిన చివరి ఓవర్ చివరి రెండు బంతుల్లో కీరన్ పోలార్డ్ (10), హార్దిక్ పాండ్య (4) అవుటయ్యారు. ముంబయి 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 189 పరుగుల గౌరవ ప్రదమైన స్కోరు చేసింది. అప్పటికి నాటౌట్‌గా ఉన్న కృణాల్ పాండ్యకు ఒక్క బంతిని ఎదుర్కొనే అవకాశం కూడా రాలేదు.
గత సీజన్‌లో మాదిరిగా ఈసారి కూడా ఐపిఎల్‌లో అట్టడుగు స్థానానికి పడిపోకుండా ఉండేందుకు కృషి చేసే క్రమంలో 190 పరుగుల భారీ లక్ష్యాన్ని చేదించడానికి ఉపక్రమించిన పంజాబ్ 20 పరుగుల స్కోరువద్ద మొదటి వికెట్‌కను మురళీ విజయ్ రూపంలో కోల్పోయింది. అతను 19 పరుగులు చేసి టిమ్ సౌథీ బౌలింగ్‌లో జొస్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మానన్ వోహ్రా (7) కూడా బట్లర్‌కే క్యాచ్ ఇచ్చి జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో వెనుదిరిగాడు. 32 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయిన జట్టును ఆదుకునే బాధ్యతను గ్లేన్ మాక్స్‌వెల్, షాన్ మార్ష్ తీసుకున్నారు. వీరు మూడో వికెట్‌కు 10.1 ఓవర్లలో 89 పరుగులు జోడించారు. 34 బంతులు ఎదుర్కొని, మూడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 45 పరుగులు సాధించిన మార్ష్‌ను రాయుడు క్యాచ్ అందుకోగా సౌథీ పెవిలియన్‌కు పంపాడు. చాలాకాలం తర్వాత ఫామ్‌లోకి వచ్చిన మాక్స్‌వెల్ 39 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 56 పరుగులు సాధించి బుమ్రా బౌలింగ్‌లో బౌల్డ్‌కావడంతో పంజాబ్ సమస్యల్లో కూరుకుంది. అతను టి-20 ఫార్మెట్‌లో వరుసగా 34 ఇన్నింగ్స్ తర్వాత అర్ధ శతకాన్ని నమోదు చేయగలిగాడు. కాగా, అదే ఓవర్‌లో నిఖిల్ నాయక్ (1)ను బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. 18 బంతుల్లో విజయానికి 51 పరుగుల దూరంలో ఉన్న పంజాబ్ 17వ ఓవర్‌లో రెండు పరుగులు చేసి, రెండు వికెట్లు కోల్పోయింది. విజయానికి 12 బంతుల్లో 49 అవసరంకాగా, మిచెల్ మెక్‌క్లీనగన్ వేసిన 19వ ఓవర్‌లో 10 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. చివరి ఓవర్‌లో అసాధ్యమైన 39 పరుగులు చేయాల్సి ఉండగా, బుమ్రా 13 పరుగులిచ్చాడు. పంజాబ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 164 పరుగులు చేసి, 25 పరుగుల తేడాతో ఓడింది.
సంక్షిప్త స్కోర్లు
ముంబయి ఇండియన్స్: 20 ఓవర్లలో 6 వికెట్లకు 189 (పార్థీవ్ పటేల్ 81, అంబటి రాయుడు 65, జొస్ బట్లర్ 24, మోహిత్ శర్మ 3/38).
కింగ్స్ ఎలెవెన్ పంజాబ్: (షాన్ మార్ష్ 45, గ్లేన్ మాక్స్‌వెల్ 56).