క్రీడాభూమి

మా పోటీ సరిపోలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సౌతాంఫ్టన్: పర్యాటక మ్యాచ్‌ల్లో ఎదురయ్యే తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొని విజయ శిఖరాన్ని ఎలా అధిరోహించాలో టీమిండియా మరింత నేర్చుకోవాల్సి ఉందని స్కిప్పర్ విరాట్ కోహ్లీ అభిప్రాయపడ్డాడు. ఇంగ్లాండ్‌తో నాల్గవ టెస్ట్ మలి ఇన్నింగ్స్‌లో 245 పరుగుల లక్ష్య ఛేదనకు 60 పరుగులు దూరంగా నిలిచిపోయిన టీమిండియా వైఫల్యాన్ని అన్యమనస్కంగా ప్రస్తావించాడు. 3-1 స్కోరుతో టీమిండియా సిరీస్‌ను కోల్పోయిన నేపథ్యంలో పరిస్థితిని క్రీజులో ఉన్నపుడే అర్థం చేసుకోవాలి తప్ప గేమ్ పూరె్తైన తరువాత కాదని విఫల ఆటగాళ్లకు చురకలంటించాడు. ‘స్కోరు బోర్డును చూసి ఎన్ని పరుగుల దూరంలో ఉన్నామో అంచనా వేసుకోవాలి. సమస్య తలెత్తినపుడు అది జరిగాలి తప్ప, మ్యాచ్ పూరె్తైన తరువాత కాదు’ అని వ్యాఖ్యానించాడు. ‘మంచి ఆట ఆడామని మాకు తెలుసు. కానీ, పోటీపడ్డామని మాకు మేం పదే పదే చెప్పుకోడానికి మాత్రం ఇబ్బంది ఉంది’ అని విచారాన్ని వ్యక్తం చేశాడు. ‘సమీపంలోకి వచ్చిన తరువాత విజయ రేఖను దాటడమన్నది ఒకరమైన కళ. అది మేమింకా నేర్చుకోవాలేమో. ఫలితానికి చేరువకాగల సత్తా జట్టుకున్నా, ఒత్తిడిని అధిగమించి ముందుకెళ్లే అనుభవాన్ని సాధించేందుకు ఒకింత వర్కవుట్ చేయాల్సి ఉంది’ అని కోహ్లీ అన్నాడు. దక్షిణాఫిక్రా సిరీస్‌లోనూ భారత్ తొలి రెండు టెస్ట్‌లు కోల్పోయి మూడో టెస్టులో విజయం సాధించింది. ఇంగ్లీష్ జట్టుపైనా అదే రిపీట్ అయిన పరిస్థితిని ప్రస్తావిస్తూ ఆరంభం నుంచే కనికరం లేకుండా ఆడటం జట్టు నేర్చుకోవాలని, భయాన్ని వదిలేస్తే పర్యాటక మ్యాచ్‌ల్లో టీమిండియా రాణింపు ఖాయమని అభిప్రాయపడ్డాడు. ‘ఆధిక్యంలోకి వచ్చిన తరువాత ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా ఆడటం తెలియాలి. నాటింగ్‌హామ్ మ్యాచ్‌లో భారత్ విజయానికి అదే కారణం. తొలి మూడు రోజులు కనికరం లేకుండా ఆడి టాప్‌లో నిలిచాం. ఆ మ్యాచ్ మాదిరిగానే సిరీస్‌ను ఎలా ఆరంభించాలన్న విషయాన్ని మేం ఆలోచించుకోవాల్సి ఉంది’ అని కోహ్లీ వ్యాఖ్యానించాడు. సుదీర్ఘ సిరీస్‌లలో పడినచోటే పైకిలేవాలంటే భయంలేకుండా క్రికెట్ ఆడాలని, భయం ఆలోచన కనీసం మనసులోకి కూడా రాకూడదని కోహ్లీ విశే్లషించాడు. మ్యాచ్‌లో, సిరీస్‌లో, మొత్తంగా బ్యాట్స్‌మెన్ల వైఫల్యంపై ప్రశ్నించినపుడు ‘టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో కీలక పరిణామాలు వెంటనే గుర్తించడం కష్టం. ఒకసారి పల్స్ దొరికిన తరువాత సులువుగా పరుగులు సాధించొచ్చు. నా వరకూ అదే జరిగింది. పరిణామాలను త్వరగా పసిగట్టిన తరువాత ఎక్కువ సేపు బ్యాటింగ్ చేసి పరుగులు సాధించగలిగాను. అదే సమయంలో సరైన భాగస్వామి వల్ల కూడా మంచి ఫలితం సాధ్యమవుతుంది’ అని కోహ్లీ అన్నాడు. ‘జట్టు సారథిగా అన్ని అంశాలనూ నెగెటివ్ కోణంలో చూడలేను. మేం బాగా ఆడాం. అంతే’ అన్నాడు. ఇంగ్లాండ్ విజయం వాళ్లు సాధించుకున్నారే తప్ప, టీమిండియా ఉదారంగా ఇచ్చేసింది కాదని అభిప్రాయపడ్డాడు.