క్రీడాభూమి

ఓంప్రకాష్‌కు షూటింగ్‌లో స్వర్ణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాంఘ్వన్ (ద.కొరియా), సెప్టెంబర్ 4: ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచ చాంపియన్‌షిప్ షూటింగ్‌లో భారత షూటర్ ఓం ప్రకాష్ మిథర్వాల్ పసిడి పతకాన్ని సాధించాడు. గోల్డ్ కోస్ట్ కామనె్వల్త్ గేమ్స్‌లో 50మీటర్లు, 10మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్‌లో రజతాలు సాధించిన ఓం ప్రకాష్ మంగళవారం 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో 564 పాయింట్లు సాధించి తన సత్తా చాటుకున్నాడు. ఈవెంట్‌లో సెర్బియా షూటర్ దమిర్ మికెక్ (562) రజతాన్ని, సౌత్ కొరియా షూటర్ డేమ్‌యుంగ్ లీ (560) కాంస్య పతకాన్ని సాధించారు. ఈ టోర్నీలో సాధించిన పాయింట్లను ఒలింపిక్ అర్హతకు పరిగణించే అవకాశం ఉన్నా, 50 మీటర్ల పిస్టల్ విభాగం రోస్టర్‌లో లేకపోవడంతో ఓం ప్రకాష్‌కు ఒలింపింగ్ బెర్త్‌కు అవకాశం లేకపోయింది.