క్రీడాభూమి

ఫెదరర్, షరపోవా ఔట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, సెప్టెంబర్ 4: సంచలనాల మరియా షరపోవా, స్విస్ సెనే్సషన్ చాంపియన్ రోజర్ ఫెదరర్ యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ నుంచి నిష్క్రమించారు. న్యూయార్క్ ఆర్థర్ అషె స్టేడియం లైట్ల వెలుగుల్లో ప్రపంచ ర్యాంకుల్లో ఎక్కడోవున్న ప్లేయర్లపై ఓటమి చవిచూసి సంచలనం రేకెత్తించారు. ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ అనిపించుకున్న ఫెదరర్, ఆస్ట్రేలియాకు చెందిన వరల్డ్ 55 ర్యాంకర్ మిల్‌మాన్ చేతిలో 3-6, 7-5, 7-6 (9/7), 7-6 (7/3) స్కోరుతో ఓటమి చవిచూశాడు. యూఎస్ ఓపెన్‌లో 41 మ్యాచ్‌లు ఆడి 20 మేజర్ టైటిళ్లను సాధించిన సూపర్ ప్లేయర్ ఫెదరర్, 50కి ఆవలనున్న ఓ ర్యాంకర్ చేతిలో ఓటమి చవిచూడటం ఇదే తొలిసారి. మ్యాచ్ మొత్తంలో 77 పొరబాట్లు చేసి, 10 డబుల్ ఫాల్ట్స్‌తో ఫెదరర్ తన ప్రత్యర్థికి విజయాన్ని అందించాడు. ‘వాతావరణం భరించలేనంత వేడిగావుంది. ఉక్కబోతతో ఊపిరి తీసుకోవడమే కష్టమైంది. మ్యాచ్ ఆడినంత సేపూ ఇబ్బంది పడ్డాను. ఓటమి ఎదురైనా, మ్యాచ్ పూర్తవడంతో చాలా హ్యాపీ అనిపించింది’ అని ఫెదరర్ వ్యాఖ్యానించాడు. ఫోర్త్ రౌండ్‌లో ఫెదరర్ విజయం సాధిస్తే, పాత ప్రత్యర్థి నొవాక్ జొకోవిచ్‌తో క్వార్టర్ ఫైనల్స్ రసవత్తరంగా సాగుతుందని అభిమానులు ఆశించారు. ఫెదరర్ ఓటమితో ఆ అవకాశం ప్రీ క్వార్టర్స్‌లో విజయం సాధించిన మిలిమాన్‌కు దక్కింది. మ్యాచ్ అనంతరం మిలిమాన్ మాట్లాడుతూ ‘ఫెదరర్ అంటే నాకు అమితమైన గౌరవరం. గేమ్ కోసం ఎంతటి కష్టాన్నైనా భరించే శక్తి అతనికుంది. నావరకు అతను ఎప్పుడూ హీరో. ఈరోజు ఎందుకో సరిగ్గా ఆడలేకపోయాడు. అయినప్పటికీ అతని ఆటను నేను ఇష్టపడతాను’ అని వ్యాఖ్యానించాడు. రష్యా స్టార్ టెన్నిస్ ప్లేయర్, 2006 చాంపియన్ షరపోవా క్వార్టర్స్‌కు చేరకుండానే యూఎస్ ఓపెన్ నుంచి రెండోసారి నిష్క్రమించింది. పుట్టినరోజు ఉత్సాహంతో కోర్టులోకి దిగిన 30ఏళ్ల స్పానిష్ ప్లేయర్ కార్లా సౌరెజ్ నవ్వారో చేతిలో షరపోవా 4-6, 3-6 స్కోరుతో ఓటమి చవిచూసింది. ‘నిజానికి సౌరెజ్ అద్భుతంగా ఆడింది. నాపైకి ఆమె కొట్టిన బంతులు చాలా వేగంగా దూసుకొచ్చాయి. ఇంతకుముందు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోని ప్రత్యర్థులకంటే కచ్చితంగా సౌరెజ్ అద్భుతంగా ఆడింది’ అని షరపొవా వ్యాఖ్యానించింది.