క్రీడాభూమి

గుత్త్ధాపత్యం చెలాయస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) వ్యవహార శైలిపై సుప్రీం కోర్టు సోమవారం అసంతృప్తి వ్యక్తం చేసింది. దేశ క్రికెట్‌లో గుత్త్ధాపత్యాన్ని చెలాయిస్తున్నారంటూ ఆగ్రహించింది. క్రికెట్‌ను చెప్పుచేతల్లో ఉంచుకొని, ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని విమర్శించింది. బిసిసిఐ పాటిస్తున్న ద్వంద్వ వైఖరి కారణంగానే చాలా మంది యువకులకు సరైన అవకాశాలు దక్కడం లేదని వ్యాఖ్యానించింది. సమ న్యాయం పాటించడం లేదని బిసిసిఐపై మండిపడింది. లోధా కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేయడంలో బిసిసిఐ లేదా దాని అనుబంధ సంఘాల అభ్యంతరాలను పరిశీలించి, విచారణ సమయంలో కోర్టుకు సలహాలు, సూచనలు ఇచ్చే బాధ్యతను సీనియర్ అడ్వొకేట్ గోపాల్ సుబ్రమణ్యానికి అప్పగించింది. స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ ఆరోపణలపై ముకుల్ ముద్గల్ కమిటీ రెండు దశల్లో ఇచ్చిన నివేదికను పరిశీలించిన అనంతరం, దోషులకు శిక్షలను ఖరారు చేసేందుకు విశ్రాంత న్యాయమూర్తి ఆర్‌ఎం లోధా అధ్యక్షతన సుప్రీం కోర్టు కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అంతేగాక, బిసిసిఐ ప్రక్షాళనకు అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరింది. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లను రెండేళ్లపాటు లోధా కమిటీ నిషేధించింది. అంతేగాక, రాజస్తాన్ సహ భాగస్వామి రాజ్ కుంద్రా, చెన్నై మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గురునాథ్ మెయప్పన్‌పై జీవితకాల సస్పెన్షన్‌ను విధించింది. దేశంలో క్రికెట్ వ్యవహారాలు పారదర్శకంగా నడిచేందుకు వీలుగా పలు సూచనలు చేసింది. ఒక రాష్ట్రానికి ఒకటికి మించిన క్రికెట్ సంఘాలు ఉండరాదని, ఒక సంఘానికి ఒకే ఓటు ఉండాలి అన్న అంశాలు కూడా లోధా కమిటీ సిఫార్సుల్లో ఉన్నాయి. కాగా, కమిటీ సిఫార్సులను అమలు చేయడం కష్టమని బిసిసిఐ వాదిస్తున్నది.
ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్, న్యాయమూర్తి ఎఫ్‌ఎంఐ కలీఫుల్లాతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ కేసు విచారణను సోమవారం కొనసాగించి, బిసిసిఐపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసింది. క్రికెట్‌కు ఉన్న ఆదరణను, దేశమంతటా ఉన్న మోజును చూసి ఎంతో మంది యువకులు కోహ్లీలుగానో, ధోనీలుగానో తయారుకావాలని అనుకుంటున్నారని, కానీ వారిలో చాలా మందికి బిసిసిఐ అవకాశాలు కల్పించడం లేదని విమర్శించింది. ‘బోర్డును నిషిద్ధ ప్రాంతంగా మార్చేశారు. ఎవరినీ రానీయకుండా మీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. భారత క్రికెట్‌ను మీ చెప్పుచేతల్లో ఉంచుకొని నడిపిస్తున్నారు. మీతో ఉన్న వారికే క్రికెట్ ఆడే అవకాశం ఉంటుంది. మీతో లేనివారు అసలు క్రికెట్ జోలికే వెళ్లకూడదన్న వైఖరి మీ చర్యల్లో కనిపిస్తున్నది. సమ న్యాయం లేదు. సమానావకాశాలు లేవు. భారత క్రికెట్‌పై గుత్త్ధాపత్యాన్ని కొనసాగిస్తున్నారు’ అని సుప్రీం కోర్టు బెంచ్ వ్యాఖ్యానించింది. ‘చాలా ప్రాంతాలకు సభ్యత్వాన్ని ఇవ్వడం లేదు. మీకు ఇష్టమైతే ఒక రాష్ట్రంలో రెండుమూడు సంఘాలకు సభ్యత్వాన్ని అందచేస్తారు. ఉదాహరణకు ఈశాన్య రాష్ట్రాలు సభ్యత్వం కోరితే మీరు ఇవ్వరు. ఎందుకంటే అక్కడ మీ ఆధిపత్యానికి గండిపతుందన్న భయం మీకు ఉంది. ఈ కారణంగానే దేశంలోని అన్ని ప్రాంతాలకు సమాన అవకాశాలు ఇవ్వడం లేదు’ అని విమర్శించింది. ‘్భరత క్రికెట్ జట్టును మీరే ఎంపిక చేస్తారు. అందుకే జట్టుపై పూర్తిగా మీ పెత్తనమే కొనసాగుతున్నది. జట్టు ఎంపిక నుంచి ప్రతి అంశాన్ని మీ చేతుల్లోనే ఉంచుకుంటున్నారు. ఆ బాధ్యతను ఎవరితోనూ పంచుకోవడం లేదు. అన్ని విధాలుగా గుత్త్ధాపత్యాన్ని కొనసాగిస్తున్నారు. ఇది సరైన విధానం కాదు. యువకులు సరైన అవకాశాలు లభించక అల్లాడుతున్నారు. అస్మదీయులకు పెద్దపీట వేయడం, ఇతరులను నిర్లక్ష్యం చేయడం సరైన పద్ధతి కాదు’ అని సుప్రీం కోర్టు బెంచ్ పేర్కొంది. లోధా కమిటీ సిఫార్సు చేసినట్టు ఒక రాష్ట్రానికి ఒకే ఓటు విధానాన్ని అమలు చేయడం కష్టమని తమిళనాడు క్రికెట్ సంఘం (టిఎన్‌సిఎ) చేసిన వాదనపైనా బెంచ్ తీవ్రంగా స్పందించింది. ‘దేశంలోని అన్ని ప్రాంతాలకూ బిసిసిఐలో స్థానం లభించాలని, ఒక రాష్ట్రానికి ఒకే ఓటు ఉండాలని లోధా కమిటీ ప్రతిపాదించింది. ఈ విషయంలో మాకు ఏదైనా ఒక రాష్ట్ర క్రికెట్ సంఘం అభ్యంతరాలతో పని లేదని స్పష్టం చేస్తున్నాం. బోర్డులో సంస్కరణలు అత్యవసరం. ఆ విధంగానే అన్ని రాష్ట్రాల క్రికెట్ సంఘాలు కూడా నడుచుకోవాలి. ఒకవేళ సంస్కరణలను వ్యతిరేకిస్తూ, ఆ విధానాలను అమలు పరచడం కుదరదని ఎవరైనా అనుకుంటే, వారు బోర్డులో సభ్యత్వాన్ని వదులుకోవాల్సిందే’ అని స్పష్టం చేసింది.