క్రీడాభూమి

విజేత ఇంగ్లాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, సెప్టెంబర్ 11: అలుపెరుగని టీమిండియా పోరాటం చివరకు గెలుపును మిగల్చలేదు. సిరీస్‌లో చివరిదైన ఐదో టెస్ట్‌ను 118 పరుగుల ఆధిక్యంతో ఇంగ్లాండ్ కైవసం చేసుకుంది. మలి ఇన్నింగ్స్‌లో కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ ధీరోదాత్త పోరాటం -సిరీస్ ఓటమిలో భారత్ గౌరవాన్ని ఇనుమడించలేదు. టెస్ట్ క్రికెట్‌లో కరుడుగట్టిన ఇంగ్లీష్ జట్టుకే ఐదో టెస్ట్‌లోనూ విజయం దక్కింది. 4-1 తేడాతో జో జట్టు సిరీస్‌ను వశం చేసుకుంది. నిజానికి ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో చివరిదైన ఓవల్ టెస్ట్‌లో భారత్ పోరాటపటిమ అద్భుతమే. సిరీస్ ఆరంభం నుంచీ విఫలమవుతూ వచ్చిన కెఎల్ రాహుల్ ముగింపులో చెలరేగాడు. 224 బంతుల్లో 149 పరుగులు సాధించి మలి ఇన్నింగ్స్‌పై ఆశలు పెంచాడు. రాహుల్ బ్యాటింగ్‌తో రిషబ్ పంత్ (114 -146 బంతుల్లో) శృతి కలపడంతో అనూహ్య విజయం అసాధ్యం కాదేమోనన్న నమ్మకాలు బలపడ్డాయి. అయితే, భారత్ ఆశల్ని ఆదిల్ రషీద్ (2/63, 15 ఓవర్లు) తుంచేశాడు. రషీద్ అద్భుత లెగ్‌బ్రేక్‌కు రాహుల్ వికెట్ల ముందు దొరికిపోవడంతో, ఉత్కంఠభరిత ఆటకు ఒక్కసారిగా బ్రేక్‌పడింది. రషీద్ బంతిని ఐదో సిక్సర్‌గా మలచుకునే ప్రయత్నంలో మొరుూన్ అలీకి రిషబ్ క్యాచ్ ఇవ్వడంతో సీన్ మొత్తం మారిపోయింది. నిజానికి ఆరో వికెట్ నష్టానికి 204 పరుగుల వద్దనున్న భారత్ మ్యాచ్‌ను డ్రా చేయాలని యోచించినా, సాధించలేకపోయింది. ముగింపు సమయంలో రెండో బాల్ తీసుకున్న రూట్, వికెట్లను పడగొట్టే బాధ్యతను శామ్ కుర్రన్ (2/23, 9 ఓవర్లు)కు అప్పగించడంతో కథ ముగిసిపోయింది. ఇషాంత్ శర్మ, రవీంద్ర జడేజా వికెట్లు వెంటవెంటనే కూల్చడంతో టీమిండియా పోరాటానికి తెరపడిపోయింది. చివరిలో ఇంగ్లీష్ సీనియర్ బౌలర్ జిమీ ఆండర్సన్ (3/45, 22.3 ఓవర్లు) మహ్మద్ షమిని పెవిలియన్‌కు పంపి, టెస్ట్ మ్యాచ్‌ల చరిత్రలో ఎక్కువ వికెట్లు తీసుకున్న పేసర్‌గా గ్లెన్ మెక్‌గ్రాత్ రికార్డును అధిగమించాడు. ఒకదశలో టీమిండియా విజయం సాధించకున్నా, కనీసం మ్యాచ్‌ను డ్రా చేయగలదన్న నమ్మకం కలిగింది. కానీ, ప్రణాళిక వర్కవుట్ కాలేదు. ఇదిలావుంటే, ఓవల్ క్రౌడ్ మధ్య అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన అలిస్టర్ కుక్‌కు భావోద్వేగ వీడ్కోలు దక్కడం ఐదో టెస్ట్‌లో ప్రత్యేకం.